నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్‌కు కీలక రాజకీయ కేంద్రంగా ఉన్న ప్రగతి భవన్.. ఇప్పుడు ప్రజా భవన్ గా మారేందుకు రెడీ అయింది. ఈ భవన్‌లోకి అనుమతి ఉన్న నాయకులను, మంత్రు లను మాత్రమే అనుమతించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ భవన్ కార్యక్రమా లు జరిగాయి. కనీసం.. గేటు తీయాలన్నా.. బాస్ అనుమతి లేకుండా జరిగేది కాదు. అది బీఆర్ ఎస్ అప్పటి మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా సరే! ఇక, సామాన్యుల పరిస్తితి చెప్పేదేముంది?
అయితే..ఈ భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తామని.. ప్రజలకు చేరువ చేస్తామని.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలు వాగ్దానం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి.. ప్రజలకు చేరువ చేస్తామని.. ప్రజాభవన్‌గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనుకున్న విధంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు సడలించేశారు.
ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను అధికారులు ఎత్తివేశారు. భవనం ముందున్న బ్యారికేడ్లను తొలగిస్తు న్నారు. జేసీబీ సాయంతో పనులు చేస్తున్నారు. బ్యారికెడ్స్ తొలగింపు పనులు పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రహదారిలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్‌ను కూడా తీసేయనున్నారు. అదేసమయంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు.. వివరాలు అందించేందుకు రాష్ట్ర సమాచార శాఖ నుంచి పీఆర్వోను ఇక్కడ అప్పాయింట్మెంట్ చేయనున్నామని అధికారులు తెలిపారు.