పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి సెట్ అయినట్టు మరోసారి జోరుగా ప్రచారం జరుగుతుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మొదట గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. 45 ఏళ్లు వచ్చిన ప్రభాస్ ఇంకా మింగిల్ కాకుండా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. గతంలో ప్రభాస్ పెళ్లిపై చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అనుష్క శెట్టి, ప్రభాస్ పెళ్లి వార్త ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు వారిద్దరూ తమ ఫ్రెండ్స్ మాత్రమే అని వివరణ కూడా ఇచ్చారు.
ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ అది కూడా నిజం కాలేదు. మరోవైపు అభిమానులు మాత్రం డార్లింగ్ ఒక ఇంటివాడైతే చూడాలని దాదాపు పదేళ్ల నుంచి ఎంతో ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ మ్యారేజ్ సెట్ అయినట్లు ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ నడుస్తోంది.
హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురితో ప్రభాస్ ఏడడుగులు వేయబోతున్నాడట. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని.. త్వరలోనే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు వెల్లడించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఈసారైనా ఇది నిజమవుతుందా? లేక గతంలో మాదిరి గాలి వార్తగా మిగిలిపోతుందా? అన్నది చూడాల్సి ఉంది.