టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అమరేంద్ర బాహుబలి పాత్రకు ప్రాణం పోసిన ప్రభాస్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. దీంతో, ప్రభాస్ ఆ సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలలో బాహుబలిగా మారాడు. బాహుబలి తర్వాత సాహో వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో నటించిన ప్రభాస్…ఆ తర్వాత కూడా వరుసగా ఆది పురుష్, రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యాడు.
తాజాగా కూడా ప్రభాస్ పలువురు నిర్మాతలతో భారీ బడ్జెట్ చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడ. దీంతో, టాలీవుడ్ లోని కొందరు దర్శకనిర్మాతలకు ప్రభాస్ అందని ద్రాక్షగా మారాడని టాక్. బాహుబలికి ముందు చాలామంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్ తో ఓ మోస్తరు బడ్జెట్ తో టాలీవుడ్ రేంజ్ కి భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్నారట. అయితే, ఒక్కసారిగా ప్రభాస్ రేంజ్ పెరిగిపోవడంతో వారికి చిక్కులు తప్పడం లేదట.
ఇకపై, ప్రభాస్ తో సినిమా తీయాలంటే అది దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ బడ్జెట్ ఉండాలన్న టాక్ టాలీవుడ్ లో వస్తోంది. అదీగాక, పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా దాదాపు రూ.60-70కోట్లకు చేరింది. దీంతో, పలువురు టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ప్రభాస్ తో సినిమా తీయాలంటే వెనకడుగు వేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకుల కథలు వింటున్నారని తెలుస్తోంది. ఒకవేళ, ఆ సినిమాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకుంటే…అదే ఊపులో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్ ను కలిసి సినిమా చేసే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.