యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేల కాంబోలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్ లో భాగంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. మామూలుగా అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోని హీరోయిన్…హీరోయిన్ ను హీరో….తెగ పొగిడేస్తుంటారు. కానీ, పాన్ ఇండియా రేంజ్ నటీనటులైన ప్రభాస్, పూజలు ఎడమొహం పెడమొహంగా ఉన్నారన్న టాక్ వస్తోంది.
పొగడ్తల సంగతి దేవుడెరుగు…సరిగ్గా మాట్లాడుకోలేదని, పొడిపొడిగా హాయ్, హలో చెప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. పూజా కనీసం డైరెక్టర్ కి ఇచ్చిన ఎలివేషన్ కూడా ప్రభాస్ కి ఇవ్వలేదని అర్థమవుతోంది. సెట్స్ కి టైం కి పూజ రాకపోవడంతో ప్రభాస్ ఆమెపై అసహనం వ్యక్తం చేశారట. అంతేకాదు, ప్రభాస్ తో పనిచేసే హీరోయిన్ ఎవరైనా రాజుగారి ఆతిధ్యానికి పడిపోతారు. ఇక, ప్రభాస్ పంపించే క్యారేజ్ కోసం ఎదురుచూస్తుంటారు. కానీ, పూజా హెగ్డే విషయంలోనే ప్రభాస్ అలా జరగలేదు.
రాధే శ్యామ్ మూవీ షూటింగ్ సమయంలో హీరోయిన్ పూజా హెగ్డేతో ప్రభాస్ కి గొడవైందన్న కథనాలు నిజమనేలా తాజాగా ఈ ఇద్దరి ప్రవర్తన ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. సెట్స్ లో పూజా యాటిట్యూడ్ నచ్చని ప్రభాస్ ఆమెపై కోప్పడ్డారని అప్పట్లో వరుస కథనాలు వచ్చాయి. అయితే, ఆ రూమర్స్ నిజం కాదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ, తాజాగా వారిద్దరి ప్రవర్తనతో ఆ గొడవ నిజమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.