సుప్రీం కోర్టు తీర్పుతో AP SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. సహాయ నిరాకరణ చేసిన అధికారులపై బదిలీ వేటు పడింది. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ వేటు వేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఒక నిర్ణయం కాదు.
సుప్రీం కోర్టు కూడా ఈరోజు ఉద్యోగుల గురించి మాట్లాడుతూ… ‘మీరు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఒక్క మాటతో వారి భవిష్యత్తును కళ్ల ముందు ఉంచింది. రాజకీయ నేతలు ఆడే గేమ్ లో ఇరుక్కున్న ఉద్యోగ సంఘాలు దీనిని మునుముందు గుర్తుంచుకోవాలి.
‘‘చాలా బాధ్యతతో కూడిన ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే.. ఎల్లప్పుడూ ప్రజల్లో ఒకే ప్రభుత్వం ఉండదు. దయచేసి మీరు గమనించాలి. మీకు ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉంది.
ప్రజలెన్నుకున్న నాయకులు, శాసనాన్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు,ఈ ముగ్గురు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ, క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం. ఇగోకు పోవడానికి ఇది వ్యక్తిగత విషయం కాదు, పరిపాలన.
ఉన్నతాధికారులైన ఐఏఎస్ అధికారులపైనే బదిలే వేటు పడిందంటే… జాగ్రత్తగా లేకపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుందో ఉద్యోగులు గుర్తుంచుకోవాలి. ఇకపై అయినా ఈ రాజకీయ కబందహస్తాల నుంచి బయటపడాలి.
నోరున్నోడు నాలుగు మాటంలాడు. కానీ చట్టం తెలిసిన వాడే గెలుస్తాడు. ఎంత నిరంకుశుడు అయినా రాజ్యాంగం పరిధిలోనే పనిచేయాలి. ప్రభుత్వాధినేతలు సులువుగా మాటలు మారుస్తారు. కానీ ఉద్యోగులకు ఆ అవకాశం ఉండదు. స్వయంగా ఎన్నికలు వద్దు అని కేసు వేసిన ఏపీ ప్రభుత్వం తీర్పు అనంతరం ఏ మాట్లాడిందో చూశారుగా…
ఎస్ఈసీ నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది – సజ్జల రామకృష్ణరెడ్డి
తమ ప్రభుత్వానికి ముప్పు వస్తే ఎలా అయినా వారు మాట మార్చేస్తారు అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?