జనసేన కోసం పోతిన మహేష్ పడిన కష్టాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటు ఇచ్చారు. కానీ… గతంలో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు పోతిన మహేష్. అందుకే ఇపుడు వైసీపీని డీకొట్టడానికి అతని స్టామినా చాలదని గుర్తించి ఆ సీటును బీజేపీకి వదులుకున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒక్కటే… వైసీపీ అరాచకత్వం నుంచి ఏపీని కాపాడాలని. కానీ చాలా మంది జనసేన నేతలు ఆ విషయం అర్థం చేసుకోకుండా పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక పోతిన మహేష్ ఏకంగా పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు.
అతను ప్రెస్ మీట్ పెట్టినపుడు అతను తన చేతిలో పేపరు చూసి చదివినపుడు అది వైసీపీ స్క్రిప్ట్ అని అర్థమైపోయింది. ఎందుకంటే నిజంగా అతనికి ఆవేదన ఉంటే మనసులోంచి మాటలు తన్నుకొచ్చేవి. తన స్టామినా అతనికి కూడా తెలుసు. కానీ వైసీపీ ఆడిన గేములో అమ్ముడుపోయిన నేత పోతిన మహేష్. అతని భవిష్యత్తు గురించి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.