• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

గులాబీ బాస్ మీద పొంగులేటి సంచలన పంచ్ లు!

NA bureau by NA bureau
April 11, 2023
in Politics, Telangana, Top Stories, Trending
0
Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

0
SHARES
201
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తూ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై పొంగులేటి ఎలా రియాక్టు అవుతారు? అన్న ప్రశ్నకు సమాధానంగా వేగంగా రియాక్టు అయ్యారాయన. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నంతనే మాట్లాడిన ఆయన.. ‘‘ఇన్ని రోజులకు దొరల గడీ నుంచి విముక్తి కలిగింది.ఇప్పటికైనా సస్పెండ్ చేయటం ఆనందంగా ఉంది. నన్ను సస్పెండ్ చేయటం హాస్యాస్పదం. జనవరి నుంచి పార్టీని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని సస్పెండ్ చేశారు’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పార్టీ నుంచి సస్పెన్షన్లే ఉండవన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘బీఆర్ఎస్ లో సస్పెన్షన్లే ఉండవని ఒకరంటారు. దమ్ము.. ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయాలని మరొకరు అంటారు. మరి, నేను సభ్యుడినే కాదన్నప్పుడు నన్నెలా సస్పెండ్ చేశారు?’’ అని ప్రశ్నించారు. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపుకోసం తనతో చాలాసార్లు మాట్లాడారని.. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. తాను ఆ మాటల్ని నమ్మి పార్టీలో చేరానని చెప్పారు. తాను పార్టీలో చేరే నాటికే తెలంగాణ వైసీపీ అధ్యక్షుడినని.. కేసీఆర్ మాటల్ని నమ్మి పార్టీలో చేరినట్లు చెప్పారు.

‘‘ఆర్థిక ఇబ్బందులున్నా.. అవమానాలు ఎదురైనా భరించా. నాకు టికెట్ ఇవ్వకున్నా కేసీఆర్ కోసం పని చేశా. 2018లో ఖమ్మం ఓటమికి కారణం ఎవరో అందరికి తెలుసు. ఖమ్మం జిల్లా సమస్యలపై ఏనాడైనా చర్చించారా? తప్పు మీ దగ్గర పెట్టుకొని నాపై నిందలు వేస్తారా? బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ  బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాను తెలంగాణ వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పార్టీలోకి చేరాలని ఎన్నోసార్లు ఆహ్వానించారన్నారు. పార్టీలో చేరాలంటూ తనపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చారన్నారు. ‘‘కేటీఆర్ అనేకసార్లు నాతో మాట్లాడి.. ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి పార్టీలో చేరా. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కేటీఆర్ కోసమే పార్టీలో ఉన్నా. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కేటీఆర్ ఎన్నోసార్లు నన్ను సంప్రదించారు. తాను ఇచ్చిన మాటలకు తగ్గట్లే.. తాను పాలేరు ఉప ఎన్నికను భారీ మెజార్టీతో గెలిపించుకొచ్చా’’ అంటూ గతాన్ని గుర్తు చేశారు. తాను పార్టీలో చేరినప్పుడు ఆర్నెల్లలో సారు గురించి నీకు తెలుస్తుందని.. అసలు రూపం చూస్తావని తోటి ఎంపీలు చెప్పారని.. ఐదు నెలల్లోనే సీఎం అసలు స్వరూపం అర్థమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తే.. రానున్నరోజుల్లో పొంగులేని నుంచి మరిన్ని పంచ్ లు తప్పవన్న మాట వినిపిస్తోంది.

Tags: brsKhammamPonguleti Srinivasa Reddy
Previous Post

న‌న్ను క్ష‌మించండి:  ప్ర‌పంచానికి ద‌లైలామా అప్పీల్ ఇదే ఫ‌స్ట్ టైమ్‌!

Next Post

పోలీసును కొట్టేసిన హైదరాబాద్ కుర్రాళ్లు

Related Posts

Andhra

ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు

May 21, 2025
Andhra

ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Andhra

చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Load More
Next Post
hyd police

పోలీసును కొట్టేసిన హైదరాబాద్ కుర్రాళ్లు

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra