• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లోకేష్ టూర్…గన్నవరంలో గరం గరం…హై డ్రామా

లోకేష్ పర్యటనను అడ్డుకున్న పోలీసులు...లోకేష్ ఫైర్

admin by admin
September 10, 2021
in Andhra, Politics
0
0
SHARES
316
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ సీఎం జగన్ కు విపక్ష నేతలు చేసే నిరసనలన్నా, ఆందోళనలన్నా, పరామర్శలన్నా భయం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఆ మాట నిజమే అని ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది కూడా. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు టీడీపీ కీలక నేత నారా లోకేష్ వరకు ఎవరు నిరసన తెలుపుతామన్నా, బాధితులను పరామర్శించేందుకు వెళతామన్నా జగన్ కు ఎక్కడ లేని భయం అని తాజాగా మరోసారి ప్రూవ్ అయింది.

నారా లోకేష్ పర్యటనను మరోసారి పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకున్నారు. నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురై అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు దగ్గరే పోలీసులు నిలిపి వేశారు. పరామర్శలకు పోలీసుల అనుమతి అక్కరలేదంటూ లోకేష్, టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

పోలీసు వలయాన్ని ఛేదించుకొని లోకేష్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఎయిర్ పోర్టులో హై టెన్షన్ ఏర్పడింది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. చివరకు పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా లోకేష్ ను ఉండవల్లి తీసుకెళ్లి ఇంటి వద్ద దింపారు. అంతకుముందు, అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని,  శాంతిభద్రతలకు భంగం కలిగించారని 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు.

ఈ సందర్భంగా పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దిశ చట్టం పేరుకే ఉందని, అత్యాచార బాధితులు ఎంతమందికి న్యాయం చేశారని లోకేష్ నిలదీశారు. బాధితులకు అండగా ఉన్న తమను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. తనను నర్సరావుపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు 3 వేల మంది పోలీసులను జగన్ మోహరించారని మండిపడ్డారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్‌, ప్రజలకేం న్యాయం చేస్తారని లోకేష్‌ ప్రశ్నించారు.

ఫిర్యాదు చేసేందుకు వెళ్లే మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను పోలీసులు హింసిస్తున్నారని, పోలీసులతో తమ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. మొత్తం 517 బాధిత కుటుంబాలను కలిసి తీరుతానని, తనను ఎవరూ ఆపలేరని లోకేష్‌ సవాల్ చేశారు.

Tags: ap cm jaganAP Policehigh dramalokesh at gannavaramlokesh narasaraopeta tourtdp leader nara lokesh
Previous Post

దుబాయ్ షేక్ నోట బాలు పాట…వైరల్

Next Post

లోకేష్ పంచ్ లు… వైసీపీ నుంచి నో ఆన్సర్ !!

Related Posts

Andhra

మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు

July 6, 2022
Top Stories

నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !

July 6, 2022
Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Top Stories

ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?

July 6, 2022
Trending

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

July 6, 2022
Load More
Next Post

లోకేష్ పంచ్ లు... వైసీపీ నుంచి నో ఆన్సర్ !!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ తెలుగు హీరో మళ్లీ ఆగయా !
  • బాహుబలిని, RRR ను వాడేయడానికి రెడీ అయిన మోడీ
  • మూడేళ్లలో ‘సాక్షి’కి రూ.380 కోట్లు
  • నుపుర్ శర్మ… ఇది భారీ ట్విస్ట్ !
  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

యథా రాజా.. తథా పోలీసు!

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra