వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కో ఆర్డినేటర్, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి అరెస్టు కు రంగం సిద్ధమైంది. ఆయనకు ఇప్పటికే పోలీసులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. 2021లో మంగ ళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ని సీరియస్గాతీసుకున్న కూటమి ప్రభుత్వం.. ఆ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసి.. జైలుకు పంపించింది. అదేవిధంగా 16 మంది కార్యకర్తలు కూడాజైల్లో ఉన్నారు.
ఇక, ఈ కేసులో మధ్యంత బెయిల్‌పై దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక వంటి వారు కొనసాగు తున్నారు. ఇక, టీడీపీ కార్యాలయంపైకేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జల రామకృష్నారెడ్డి కి ఇప్పటికే 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. అయితే.. ఆయన ఈ కేసు విచారణకు వచ్చినా.. ఆ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికి రెండు సార్లు విచారణ జరిగింది.