ఏపీ విపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఇటీవల రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. కావాలనే రాళ్లు వేయించుకుంటారంటూ రాజకీయ ప్రత్యర్థులు రాగాలు తీస్తున్న వేళ.. వారికి సంబంధించిన మీడియాలో ఒక రాయి అన్నట్లు సింఫుల్ గా తేల్చేశారు. తమకు జరిగేది ఏదైనా ప్రపంచంలో మరెవరికీ జరగదన్నట్లు.. అలాంటిదే ఇతరులకు జరిగితే మాత్రం.. దాని వెనుక కుట్ర.. కుత్రంతాలు ఉన్నట్లుగా ప్రచారం చేయటం తెలిసిందే. ఇంతకూ చంద్రబాబు మీద రాళ్లదాడి జిరగింది ఎప్పుడు? ఏ సందర్భంలో అంటే.. ఆయన నందిగామలోని పార్టీ కార్యాలయానికి వెళుతున్న వేళలో ఆయన కాన్వాయ్ మీద రాళ్లు విసిరారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు రక్షణగా నిలిచిన సెక్యురిటీ ఆఫీసర్ కు రాళ్లు తగిలాయి. అయితే.. విసిరిన రాళ్లు ఒకటి కాదని.. దాదాపు పన్నెండుకు పైనే ఉన్న కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. మరి.. దీనిపై పోలీసులు ఏం చెబుతున్నారు? వారి ప్రాథమిక విచారణలో ఈ ఉదంతం గురించి ఏయే విషయాల్ని గుర్తించారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడి అనంతరం.. ప్రత్యేక దర్యాప్తు టీంలను ఏర్పాటు చేశారు. డీసీపీ విశాల్ గున్ని పర్యవేక్షణలో సిట్ లు పని చేస్తాయని పోలీసు కమిషనర్ కాంతి రాణా వెల్లడించారు.
బాబుపై జరిగిన దాడిని విశ్లేషించినప్పుడు.. ఎత్తైన భవనాల నుంచి రాళ్లు విసిరినట్లుగా గుర్తించారు. ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోని భవనాల నుంచే ఈ రాళ్లు పడినట్లుగా గుర్తించారు. దీంతో.. వాటికి సంబంధించిన వివరాల్నిబయటకు తెచ్చేందుకు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ.. సీసీ టీవీ ఫుటేజ్ లను సేకరించటం ద్వారా.. ఈ దాడికి కారణం ఎవరు? అన్న విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.