ఏపీ ప్రజల జల జీవనాడి.. బహుళార్థ సాధక ప్రాజెక్టుగా వన్నెకెక్కి.. సాగు, తాగు నీటి పరంగా రాష్ట్రానికి, విద్యు త్ పరంగా మనతో పాటు.. మరిన్ని రాష్ట్రాలకు ప్రయోజనకారిగా మారుతుందనుకున్న పోలవరం (ఇందిరా సా గర్) ప్రాజెక్టుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కబడ్డీ ఆడుకుంటున్నాయనే భావన సర్వత్రా వినిపి స్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి దక్కిన అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కావడంతో ఇటు సీమ, అటు ఉభయ గోదావరి, కోస్తా.. విశాఖ ప్రజలు దీనిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇది పూర్తికావడాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, అప్పట్లో అనూహ్య కారణాలతో ఇది వెనుకబడింది.
నిధులపై కేంద్రం కొర్రీలు
ఇక, ఇప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు పీక నులిమేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ప్రాజెక్టు నిధుల విషయంలో కొర్రీలు వేసింది. 2014 నాటి లెక్కల ప్రకారం పాతిక వేల కోట్లతోనే కట్టుకోవాలని హుకుం జారీ చేసింది. వాస్తవానికి పెరుగుతున్న ద్రవ్యల్బొణం కారణంగా.. ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్‌కు నిర్మాణ వ్యయాన్ని పెంచుతూ.. గత చంద్రబాబు ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీని ప్రకారం 57 వేల కోట్ల పైచిలుకు మొత్తం అవసరమవుతుందని పేర్కొంది.
నివేదిక సిద్ధం!
కానీ, అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంగా ఉండడంతో.. కేంద్రానికి లేఖలు రాసి.. అంత ఎందుకు? ఇంత ఎందుకు? అంటూ ప్రశ్నలు లేవనెత్తింది. కట్ చేస్తే.. జగన్ సర్కారు గత చంద్రబాబు ప్రతిపాదన మేరకు తమకు నిధులు ఇవ్వాలని పేర్కొంది. కానీ, కేంద్రం మాత్రం ససేమిరా అన్న విషయం తెలిసిందే. అంతేకా దు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించారని, 300 నుంచి 500ల పేజీలతో నివేదిక కూడా సిద్ధమైందని తెలుస్తోంది. అంటే.. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు విషయంలో కోత..వాతలే తప్ప.. మరో మార్గం లేదని కేంద్రం స్పష్టం చేసేసింది.
సమరం చేయలేక.. సాగిల పడి!
మరి కేంద్రం ఇలా చేస్తుంటే.. కీలకమైన ప్రాజెక్టు విషయంలో తాను ఒంటరిగా అయినా.. లేక రాష్ట్ర పార్టీలన్నింటితో కలిసైనా కేంద్రంపై పోరాడాల్సిన జగన్.. పోలవరాన్ని చిదిమేసేందుకే మొగ్గు చూపుతుండడం మరింత దారుణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పోలవరం ఎత్తును తగ్గించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ఆయన చూపుతున్న కారణం.. కేసీఆర్! ఆయన వల్లే ఎత్తు తగ్గించాల్సి వస్తోందని పేర్కొంటున్నా.. ఇది ఖచ్చితంగా జగన్ చేతకాని తనమనే అంటున్నారు ప్రజలు. పోలవరం ఎత్తు తగ్గితే.. గ్రావిటీ ద్వారా విశాఖ పట్నానికి నీటిని అందించాలన్న ప్రణాళిక పూర్తిగా మూలన పడుతుంది.
నిధుల…
ఎత్తిపోతలు
ఖాయం!
అయితే.. ఇలా ఎత్తు తగ్గించడంలోనూ జగన్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారని అంటున్నారు నిపుణులు. పోలవరం ఎత్తు తగ్గడంతో.. గ్రావిటీ ద్వారా విశాఖకు నీరు ఇవ్వలేక పోయినా.. ఎత్తిపోతల ద్వారా ఇవ్వొచ్చని ఆయన ప్రతిపాదించారు. తద్వారా.. ఈ ఎత్తిపోతల పథకాన్ని మేఘా కృష్ణారెడ్డికి అప్పగించి.. తద్వారా.. 20 వేల కోట్ల రూపాయల వరకు లబ్ది పొందాలనేది జగన్ ప్రణాళికగా ఉందని ప్రచారం సాగుతోంది. ఇక, తమ అనుకూల వాదనను వినిపించే వారిని కూడా ఆయన ఎంచుకుని తన సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అధికార ప్రతినిథి, పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబును దీనికి బాగా వాడుకుంటున్నారని తెలుస్తోంది.
పోలవరం.. ఉనికే పోతుందా?
బ్రిటిషర్ల హయాంలోనే బీజం వేసుకున్న పోలవరం ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 250 టీఎంసీలు. ప్రస్తుతం ఇది 194 టీఎంసీలకు తగ్గిపోయింది. దీనిలో 175 టీఎంసీలను వినియోగించుకోగా.. 17 టీఎంసీలను నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనిలోనే 23 టీఎంసీలను విశాఖ ప్రజల తాగునీటి సమస్యను నివారించేందుకు గ్రావిటీ ద్వారా వినియోగించవచ్చు. అయితే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును 3.57 మీటర్లు తగ్గించాలని ఆదేశించింది. ఇదే జరిగితే.. గ్రావిటీ ద్వారా విశాఖ ప్రజలకు నీరు అందే అవకాశం లేదు. దీంతో ఎత్తిపోతల తప్పదు. అదేసమయంలో నిల్వ సామర్థ్యం కూడా 20 నుంచి 25 టీఎంసీలు తగ్గిపోవడంతోపాటు వినియోగ సామర్థ్యం 150 టీఎంసీలకు పడిపోనుంది. ఫలితంగా పోలవరం తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరి ఇప్పటికైనాజగన్ ఏపీ ప్రజల బాగు కోరతారా? తన వ్యక్తిగత లబ్ధికి.. కేంద్రానికి సాగిలపడాలనే వ్యూహానికే మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.