గతంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తన సత్తా చాటింది. జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా తన బలాన్ని ప్రదర్శించి.. పలుచోట్ల పాగా వేయాలన్న పోరాటపటిమను ప్రదర్శించింది. తుది ఫలితం ఎలా ఉన్నా.. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎన్నికల పోరులో తలబడింది.
కీలకమైన ghmc పోలింగ్ ముగిసి.. ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న వేళ.. ప్రధాని మోడీ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ వచ్చింది. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వివరాల్ని అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. దాదాపు పది నిమిషాల పాటు ప్రధాని మాట్లాడినట్లు చెబుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లోబీజేపీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారంటూ అభినందనలు తెలిపారు. నేతలు.. కార్యకర్తలపై జరిగి దాడుల గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. నూతన ఉత్సాహంతో పని చేయాలని క్యాడర్ కు ప్రధాని సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.
పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. పోలింగ్ఏ రీతిలో సాగిందన్న వివరాల్ని అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్ని బీజేపీ అధినాయకత్వం ఎంత సీరియస్ గా తీసుకుందన్న విషయానికి ప్రధాని ఫోన్ కాల్ పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు. మరి.. బీజేపీ అధినాయకత్వం ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు ఎంతమేర ఆదరించారో చూడాలి.