ఇటీవల ప్రపంచంలో అందమైన దేశం ఏదీ అంటే.. ఎగ్జింబర్గ్ అని సమాధానం వచ్చింది. ఇది నిజంగానే అందమైన దేశం. ఎక్కడా చుక్కనీరు రోడ్డు పై కనిపించదు. ఆఫీసుల్లో అయినా.. సినిమా హాళ్లలో అయినా.. టాయిలె ట్లు కూడా అందంగానే ఉంటాయట. అంతేకాదు.. దుర్వాసన అనేదే శోకదట. ఇక, ప్రకృతి నిజంగానే రమణీయంగా పచ్చని తోరణం కట్టుకున్నట్టు ఉంటుందట అందుకే ఆ దేశానికి అందమైన దేశంగా కితాబు దక్కింది. ఈ జాబితాలో మన దేశం 122వ స్తానంలో ఉండడం గమనార్హం.
ఇక, ప్రపంచ పర్యాటక దేశం ఏదీ.. అని లెక్కలు వేస్తే.. స్విట్జర్లాండ్ ఫస్ట్‌లో ఉంది. పర్యటకులకు స్వర్గధామంగా ఈ దేశంలో పేరు తెచ్చుకుంది. అంతేకాదు.. ప్రశాంతతకు కూడా నెలవుగా మారింది. ఈ జాబితాలో మన దేశం 33వ స్థానంలో ఉంది. గతంలో మన దేశం 30లో ఉండగా.. ఇప్పుడు 33వ స్థానానికి పడిపోయింది. ఇలా.. ఉంది మన పరిస్థితి. మరి మనం ఎందులోనూ ఫస్ట్ లేమా? అంటే.. ఉన్నాం. అదే.. ప్లాస్టిక్ భూతం వెంటాడుతున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే ముందుందట.
ఈ విషయాన్ని ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్ తాజాగా చెప్పుకొచ్చింది. ప్రపంచంలో కాలుష్య భూతాన్ని తరిమివేయాల ని, 2030 నాటికి కాలుష్య రహితం చేయాలని ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది.దీంతో అన్ని దేశాలు కూడా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాయి. మన దేశంలోనూ గత ఏడాది పాల్తీన్ కవర్లపై నిషేధం విధించారు. కాని.. ఇది ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను నేచర్ పత్రిక వెల్లడించింది.
ఈ జాబితాలో భారత దేశంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉందట. పొరుగున ఉన్నచిన్న పాటి దేశాలు చేస్తున్న ప్రయత్నం కూడా భారత్ చేయడం లేదని నిష్టూరంగా చెప్పుకొచ్చింది. ఇతర ఏదేశం కూడా పోటీ పడలేనంతగా ..భారత దేశం ప్లాస్టిక్ కాలుష్యంలో పోటీ పడుతున్నట్టు చెప్పుకొచ్చింది. 2030 నాటికి భారత్ లో ప్లాస్టిక్‌ను కట్టడి చేయడం అసాధ్యమని.. ఇప్పుడు న్న విధానాలు ఇలానే కొనసాగితే.. మరింతగా దేశం ప్లాస్టిక్ వైపు మొగ్గు చూపుతుందని వ్యాఖ్యానించింది.