2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి సీఎం జగన్ తరఫున ఐప్యాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. ఐ ప్యాక్ అధినేత, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సలహాలు తు.చ తప్పకుండా పాటించిన జగన్….ఏపీలో అధికారంలోకి వచ్చారని టాక్ ఉంది. జగన్ కే కాదు, 2014లో మోదీ మొదలుకొని 2021లో దీదీ వరకు ఎంతోమందిని పీకే గెలుపు గుర్రం ఎక్కించాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా అన్న జగన్ బాటలోనే చెల్లి వైఎస్ షర్మిల కూడా నడవాలని డిసైడ్ అయ్యారు.
తెలంగానలో పార్టీ పెట్టి చక్రం తిప్పాలని చూస్తోన్న వైఎస్ షర్మిల…ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియను తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియ…తాజాగా లోటస్పాండ్లో షర్మిలతో భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు, పార్టీ వ్యూహాలపై షర్మిలకు వ్యూహకర్తగా ప్రియ సలహాలు, సూచనలు చేయనున్నారు. తమిళనాడులో ఓ మీడియాకు ప్రియ అధినేతగా ఉన్న ప్రియపై షర్మిల భారీ అంచనాలే పెట్టుకున్నారట.
తెలంగాణలో 2023లో జరగబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోన్న షర్మిల…ఇందులో భాగంగానే అనుసరించాల్సిన వ్యూహాలపై కొత్త వ్యూహకర్త ప్రియను నియమించుకున్నారట. మరి, అన్న జగన్ కు పీకే సక్సెస్ ఇచ్చినట్టుగా…చెల్లి షర్మిలకు ప్రియ సక్సెస్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.