వైసీపీ ఎమ్మెల్యే.. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి .. అధికారుల సెగ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వచ్చినట్టుగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నా యి. వైసీపీ అధికారంలో ఉండగా.. తనకు నచ్చిన, తాను మెచ్చిన అధికారులను తన నియోజకవర్గంలో వేయించుకుని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పిన్నెల్లిపై టీడీపీ సహా ఇతర పక్షాలు కూడా ఆరోపించా యి.
అయితే.. వాటిని అప్పట్లో వైసీపీ కానీ.. కీలకస్థానాల్లో ఉన్న డీజీపీ, సీఎస్ వంటి వారు కానీ పట్టించుకోలే దు. దీంతో గత ఐదేళ్లలో ఎంతో మంది నియోజకవర్గం నుంచి పారిపోయారు. వేరే ప్రాంతాల్లో తల దాచుకు న్నారు. ఇలాంటి వారిలో టీడీపీ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు.. మారిన వాతావరణంతో వారంతా తిరిగి వస్తున్నారు.. ఇదిలావుంటే.. ఈవీఎం పగులగొట్టిన కేసు, సీఐ సహా టీడీపీ ఏజెంట్ పై చేసిన హత్యా యత్నం కేసులు ఇప్పుడు పిన్నెల్లికి చుట్టుకున్నాయి. వీటిలో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినా… కేసుల విచారణ మాత్రం కొనసాగుతోంది.
ఇదే ఇప్పుడు పిన్నెల్లికి నొప్పిపెడుతోంది. విచారణ అధికారులు తనకు అనుకూలంగా నివేదికలు ఇవ్వర నేది ఆయనకు స్పష్టం కావడంతో వ్యూహాత్మకంగా కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను విచారిస్తున్న దర్యాప్తు అధికారులను మార్చాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఐజీ సహా కొందరు పోలీస్ అధికారులు తమను టార్గెట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని కోర్టుకు తెలిపారు. మాచర్లలో అల్లర్ల తర్వాత వైసీపీ క్యాడర్ పైనే కేసులు పెట్టారని తెలిపారు.
అయితే… ఇదేసమయంలో తమపైనా, తమ వర్గం నేతలపైనా దాడులు చేసిన వారిని మాత్రం తప్పించా రని పిన్నెల్లి కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని మార్చాలని ఆయన కోర్టు ను వేడుకున్నారు. అయితే.. దీనిపై కోర్టు ఎలాంటినిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గత ఐదేళ్లలో మాచర్లలో ఏం జరిగిందో ఇప్పుడు పిన్నెల్లి చెబుతున్నట్టు జరిగితే మాత్రం అది పూర్తిగా రివర్స్ అయింది.
టీడీపీ నాయకుడు జల్లయ్యను దారుణంగా హత్య చేసినప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే.. తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. మరో నాయకుడిని అడ్డంగా నరికితే అప్పుడు కూడా అదే జరిగింది. పైగా.. పోలీసులపై టీడీపీ నేతలు తిరుగుబాటు చేశారంటూ.. రివర్స్ కేసులు పెట్టి అర్ధరాత్రి వేళ అరెస్టు లు చేశారు. అయితే.. ఇప్పుడు నొప్పిలో పిన్నెల్లికి అవన్నీ.. గుర్తుకు రాకపోవచ్చు. కానీ, కాలం ఎప్పుడూ ఏకపక్షం కాదు.. అది మారుతూ ఉంటుందనే సత్యం గ్రహించాలి.