వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో మండిపోయిన జనం ఉప ఎన్నికలలో మోడీకి బుద్ధిచెప్పారు.
జనంలో కోపం గ్రహించిన మోడీ 10 రూపాయలు డీజిల్ పై తగ్గించారు.
అంతేగాకుండా బీజేపీ ఆధీనంలో ఉన్న రాష్ట్రాలు అదనంగా మరో 7 రూపాయలు తగ్గించేలా చేశాడు.
ఇక ఏపీలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరికి తెలిసిందే
చంద్రబాబు మళ్లీ గెలిస్తే వీర బాదుడు ఉంటుందని జనాల్ని భయపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ధరలు, పన్నులు పెంచడంలో రికార్డులు మీద రికార్డులు సృష్టించాడు.
అపుడెపుడో ఔరంగజేబు అనే ముస్లిం రాజు యడా పెడా పన్నులు వేసినట్లు జగన్ చెత్త మీద కూడా పన్నేశాడు. మాస్కు లేకపోతే పన్నేశాడు. బాత్రూంల మీద పన్నేశాడు. బయట తిరిగితే పన్నేశాడు.
ఇదంతా ఒకెత్తు అయితే, ప్రస్తుతం దేశంలోనే పెట్రోలు రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా దేశాన్ని విస్మయానికి గురిచేశాడు.
పక్కన ఉన్న కర్ణాటక కంటే మన రాష్ట్రంలో పెట్రోలు రేటు 11 రూపాయలు ఎక్కువ. దీన్ని బట్టి జగన్ పన్నుల అరాచకం ఎంత ఘోరమో అర్థంచేసుకోవచ్చు.
పెట్రోలు ధరల తగ్గింపునకు వ్యతిరేకంగా జనం పోరాడుతుంటే … కేంద్రం పెంచితే ఏమనరు… నేను పెంచితే ఏంటి నొప్పి అంటూ పాతిక కోట్లు పెట్టి పత్రికల్లో జగన్ ప్రకటనలు ఇచ్చాడు.
పైగా అందులో తానెంత ఎక్కువ ట్యాక్సు వేస్తున్నదీ గర్వంగా చెబుతున్నాడు జగన్. అంటే దీన్ని బట్టి చూస్తే… మీరేమన్నా చేస్కోండి నేను పెట్రోలు ధరలు తగ్గించను అని జగన్ జనానికి సవాల్ చేస్తున్నట్టు ఉంది ఆ ప్రకటన.
తనను ఇబ్బంది పెట్టిన బీజేపీపై అక్కసు కూడా అందులో వెళ్లగక్కాడు. అసలు బీజేపీని రెండు భుజాల మీద మోస్తూ జగన్ కు నిత్యం పాద నమస్కారం చేసే జగన్.. కేవలం తన మీద జనం కోపం తగ్గించడానికి మాత్రం బీజేపీపై పోరుకు రెడీ అయినట్లు నటిస్తున్నారు.
సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ తో అందరినీ అదుపులోకి తెచ్చుకునే మోడీకి జగన్ ని కంట్రోల్ చేయడం చిటికె వేసినంత పని. ఈ నేపథ్యంలో జనం పన్నుల డబ్బులు ఇలా ప్రకటనల మీద ఖర్చుపెట్టి బీజేపీపై నెపం మోపి తప్పించుకునే జగన్ ప్రయత్నాన్ని జనం హర్షించరు.
జనం ఆలోచించేది ఒకటే… ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఓటేస్తే జగన్ ఇలా రోజూ పెట్రోలు డీజిల్ మీద తమ డబ్బులు లాగేస్తున్నాడని జనం ఫిక్సయైపోయారు. అసెంబ్లీ ఎన్నికలు రావడమే తరువాయి.