ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదంపై టాలీవుడ్ హీరో నానితోపాటు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. తాము కట్టే పన్నులతో మంత్రులు జల్సాలు చేస్తున్నారంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. చెన్నైలో ట్యాక్సులు కట్టే సిద్ధార్థ్‌కు.. ఏపీ ప్రభుత్వంతో ఏం సంబంధమని ప్రశ్నించారు. తమిళనాడులో ఉంటున్న సిద్ధార్థ్ ఏది కొనుక్కున్నా తమిళనాడు ప్రభుత్వానికే వెళుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సిద్ధార్థ్ ను ఇరకాటంలో పడేద్దామనుకున్న నాని…అనుకోకుండా జగన్ ను ఇరకాటంలో పడేశారు.
సిద్ధార్థ్ పై పేర్ని నాని చేసిన కామెంట్లను బట్టి చూస్తే…పక్క రాష్ట్రాల్లో ట్యాక్స్ కట్టే వారు ఇతర రాష్ట్రాలలో జరిగే విషయాల గురించి స్పందించకూడదు. ఈ లెక్కన చూస్తే…ఏపీ సీఎం జగన్ ఏపీలోని విషయాలపై అస్సలు స్పందించకూడదు. ఎందుకంటే, జగనన్నకున్న కంపెనీలలో మెజారిటీ కంపెనీలు, వాటి హెడ్ ఆఫీసులు, జగనన్న ఆస్తులు…ఇవన్నీ తెలంగాణలో, కర్ణాటకలో ఉన్నాయి. జగన్ కట్టే పన్నుల్లో మెజారిటీ వాటి తెలంగాణకు వెళుతుంది. కాబట్టి, జగన్ …తెలంగాణలో విషయాలపై మాత్రమే స్పందించాలి అన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే పేర్ని నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఏదో కామెంట్ చేద్దామనుకుంటే బూమరాంగ్ లా తిరిగి మళ్లీ అది జగన్ కే తగిలిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పన్ను ఎక్కడ కడుతున్నామన్నది కాదన్నయ్య…ప్రశ్నించామా..లేదా