రాజకీయాల్లో ఉన్న నాయకులకు క్రెడిట్ ముఖ్యం. ఏం చేశారనే విషయం పక్కన పెడితే.. దానిద్వారా.. ఎంతో కొంత క్రెడిట్ దక్కించుకుని ప్రజల్లోకి వెళ్లి.. తమ ప్రాధాన్యాన్ని చెప్పేందుకు రెడీ అవుతుంటారు. అందుకే ఎక్కడ ఎలాంటి అవకాశం దక్కినా వదిలి పెట్టరు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఏపీలోనూ చోటు చేసుకుంటోంది.
సినిమా టికెట్ల వ్యవహారం గత రెండు మాసాలుగా ఏపీని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వంపై.. గతంలో వ్యాఖ్యలు చేశారు. మంత్రులను సన్నాసులు అంటూ.. వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా.. మంత్రి పేర్ని నాని వెంటనే రంగంలోకి దిగి వ్యాఖ్యలు చేశారు.
మేంమేం కాపు నాకొడుకులం.. అంటూ..పవన్ టార్గెట్ చేశారు. మంచో చెడో.. అప్పటి నుంచి ఏపీలో సినిమా వ్యవహారం అంటే.. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా పేర్ని నాని పేరు వినిపిస్తోంది. సినిమా వాళ్లకు ఏ సమస్య వచ్చినా.. కేరాఫ్ పేర్ని.. అనేటాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.
ఇటీవల రామ్ గోపాల్ వర్మ కూడా పేర్ని నానితో భేటీ అయ్యారు. సమస్యలపై చర్చించారు. దీంతో.. సినిమాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని.. సదరు మంత్రి పేర్ని నాని భావిస్తూ వచ్చారు. అయితే.. తాజాగా జరిగిన ఘటన మాత్రం మంత్రి పేర్నిని ఇబ్బంది పెట్టిందని అంటున్నారు ఆయన అనుచరులు.
మెగాస్టార్ చిరంజీవి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో తాడేపల్లికి వచ్చిన చిరు.. సీఎం తో దాదాపు గంటన్నరకు పైగానే భేటీఅ అయ్యారు. ఆయా అంశాలపై ఆయన చర్చించారు. అయితే.. ఆది నుంచి కూడా సినిమాలపై మాట్లాడుతున్న మంత్రి పేర్ని నానిని ఆయన సంప్రదించలేదు. అంతా సీఎం తోనే మాట్లాడి వెళ్లిపోయారు. అసలు.. నాని ప్రస్తావనే లేకుండా.. కార్యక్రమం జరిగిపోయింది.
దీంతో ఇప్పుడు పేర్ని వర్గం ఆలోచనలో పడింది. ఇప్పుడుఏదైనా.. నిర్ణయం తీసుకుంటే.. మంత్రి పేర్నికి క్రెడిట్ దక్కుతుందా? అని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని వల్ల కాని సమస్య పరిష్కారం.. ఇప్పుడు అయిందనే వాదన వస్తే..ఆయన ఇమేజ్ డ్యామేజీ అవుతుందని.. వారు భావిస్తున్నారట. దీంత మంత్రి కూడా ఒకింత ఆలోచనలో పడ్డారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.