టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడ, గన్నవరం, పెనమలూరులో దిగ్విజయంగా సాగింది. యువనేత లోకేష్ కు సంఘీభావంగా మహిళలు, యువతీయువకులు, ముసలివారు సైతం భారీగా రోడ్లపైకి తరలిరావడంతో పాదయాత్ర జనసంద్రంగా మారింది. రోడ్డు డివైడర్లు, భవనాలపైకి ఎక్కి మరీ లోకేష్ కు జనం అభివాదం చేశారు. ప్రజలతో మమేకమైన లోకేష్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది నెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసానిచ్చారు.
ఆదివారం నాడు ఏకంగా 12 గంటల పాటు లోకేష్ అలుపెరుగని సైనికుడిలా నడిచారు. జనం అభిమానంతో లోకేష్ ను కలిసేందుకు తండోపతండాలుగా రావడంతో 8 గంటలు ఆలస్యంగా పాదయాత్ర సాగింది. అర్థరాత్రి అని కూడా చూడకుండా లోకేష్ కోసం జనం వేచి చూశారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజాము 3.40 గంటల వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశంసలు కురిపించారు.
189వ రోజు 12 గంటల పాటు 16 కిలోమీటర్ల మేర నిర్విరామంగా లోకేష్ నడిచారని ఉమ అన్నారు. లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అందుకే, షెడ్యూల్ కంటే 8 గంటల ఆలస్యంగా పాదయాత్ర సాగిందని ఉమ అన్నారు. నిన్న సాయంత్రం విజయవాడలో మొదలైన పాదయాత్ర గన్నవరం నియోజకవర్గం నిడమానూరులో ఈ రోజు తెల్లవారుఝామున ముగిసింది. రాత్రి 1.15 గంటలకు పెనమలూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. అర్ధరాత్రి కూడా జనాలు పోటెత్తడంతో లోకేష్ తన అలసటను మర్చిపోయి ఉల్లాసంగా కనిపించారు. తన చేతివేళ్లకు గాయమైనా లెక్కచేయకుండా జనంతో మాట్లాడారు. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గన్నవరంలో ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు..#LokeshinGannavaram#YuvaGalamPadayatra #YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh#AndhraPradesh pic.twitter.com/TeSNl7NDim
— Telugu Desam Party (@JaiTDP) August 21, 2023
నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ తెల్లవారుజాము 3.40 వరకూ సాగిన లోకేశ్ పాదయాత్ర – 12 గంటలు నిర్విరామంగా సాగిన 16 కి.మీ.ల పాదయాత్ర – అడుగడునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా సాగిన పాదయాత్ర. #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra… pic.twitter.com/nk1RppMLWI
— Devineni Uma (@DevineniUma) August 21, 2023