ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతిపక్ష పార్టీల నేతలపై సందర్భం దొరికితే చాలు విమర్శలతో, వెటకారపు వ్యాఖ్యలతో సెటైర్లతో విరుచుకుపడటం అంబటికి అంబలితో పెట్టిన విద్య అని టిడిపి నేతలు విమర్శిస్తుంటారు. అయితే, కొన్ని సమయాల్లో అంబటి వాడే భాష చాలా అభ్యంతరకరంగా ఉంటుందని విమర్శలు కూడా వస్తుంటాయి. అసలు అంబటికి విలువలు లేవని, నోటికేదొస్తే అది మాట్లాడుతుంటారని కూడా టీడీపీ నేతలు దుయ్యబడుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా అంబటికి విలువలు లేవు అని వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ‘‘నిప్పో తుప్పో నాకు తెలియదు..అంటే రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని విలువలు పాటిస్తుంటారు…. ఆ విలువలకు లోబడి నేనేదైనా మాట్లాడగలుగుతా తప్పితే…మా అంబటి రాంబాబు గారు..ఆ మాదిరిగా నేను మాట్లాడను…’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. మరి, పెద్దిరెడ్డి కామెంట్లపై అంబటి స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
రోజా ?
నిప్పో ..! తొప్పో .. ! నాకు తెలియదు . !
అంబటి రాంబాబు లా.గా నేను మాట్లాడలేను : పెద్దిరెడ్డి . pic.twitter.com/QMFY3yfTbu— CBN ARMY VIZAG (@Cbnarmyvizag) October 5, 2023