అధికారంలో ఉన్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు.. తనకు సానుకూల వాతావరణం కల్పించుకునేం దుకు ఎంతో స్కోప్ ఉంది. అంతేకాదు.. ఎన్నికలకు ఇంకా 8-9 నెలల సమయం కూడా ఉంది. ఈ నేప థ్యంలో ఏ మంత్రి అయినా.. తనపై అంతో ఇంతో వ్యతిరేకత ఉందని భావించినప్పుడు.. దానిని సరిచేసు కునేందుకు సమయం కూడా ఉంది. సంక్షేమ పథకాలను మరింత పెంచడమో.. లేక సర్కారునుంచి సొమ్ములు తెచ్చి అభివృద్ధి చేయడమో చేయాలి.
కానీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాస ఎమ్మెల్యే కమ్ మంత్రి వర్యులు సీదిరి అప్పలరాజు మాత్రం ఈ విషయాన్ని వదిలేశారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం.. దొడ్డిదారులు, దొంగ దారులు వెతుక్కుంటున్నారనే వాదన బాహాటంగానే వినిపిస్తోంది. ఆయన కార్యాలయంలో పనిచేస్తున్నవారే ఈ విషయాలను బయటకు చెప్పడం అందరినీ విస్మయానికి కూడా గురిచేస్తోంది. అంతేకాదు.. ఆ మంత్రిగారికి ఇంత ఓటమి భయం పట్టుకుందేంటబ్బా?! అనే చర్చ కూడా సాగుతోంది.
ఇంతకీ సదరు మంత్రి ఏం చేస్తున్నారంటే.. తన పలాస నియోజకవర్గం పరిధిలో ప్రజల నుంచి మంత్రికి వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు కూడా ఆయనను హెచ్చరించారు. మంత్రిగా ఉండి.. ఇన్ని మైనస్ మార్కుల్లో ఉన్నావేంటి? అంటూ.. అధిష్టానం ఆయనకు తలంటేసింది. అయితే.. ఆయన ఈ విషయాన్ని పాజిటివ్‌గా తీసుకుని.. ప్రజల్లోకి వెళ్లి.. లేదా వ్యతిరేకత ఎక్కడ పుట్టిందో కారణాలు తెలుసుకుని ముందుకు సాగితే బాగుండేది.
కానీ, అలా చేయడం మానేసి.. తనకువ్యతిరేకంగా ఉన్న మండలాలు, గ్రామాలపై పడ్డారు. ఇక్కడ గుండు గుత్తగా ఓట్లు తీసేయాలని.. కొందరిని ఆయన ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు.. బహిరంగ సభల్లోనే మంత్రి వర్యులు ఈ ఆదేశాలు ఇవ్వడం.. సంచలనంగా మారింది. ముఖ్యంగా తనకు అనుకూలంగా లేని వారి ఓట్లు తీసేయాలని తాజాగా ఓ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. మరి ఆయనకు అంత భయం ఉన్నప్పుడు ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు చేయాలి కదా! అంటే.. ఆ ఒక్కటీ వద్దని ఆయనే అనేస్తున్నారు. ఇదీ.. సంగతి!!