ఎన్నెన్ని మాటలు.. ఎంత అవమానం. తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారని కూడా చూడకుండా ఇంటికి పిలిపించి మరీ అవమానించారు. అయినా సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన అన్నీ భరించారు. కానీ ఆయనకో తమ్ముడు ఉన్నారని, ఇలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోరు అని ఇప్పుడు అందరికీ బాగా అర్థమైంది. ఆయనకు ఉన్న తిక్కతో లెక్కలు సరిచేశారనే విషయం స్పష్టమైంది. ఆ అన్నయ్య చిరంజీవి అయితే ఆ తమ్ముడు పవన్ కల్యాణ్. తాజాగా ఏపీ ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్.. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లోనూ పార్టీని గెలుపు వైపు నడిపించారు.
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఇంటికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు చిరంజీవి కుటుంబం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా అన్నయ్యకు పవన్ పాదాభివందనం చేయడం ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నయ్యను అవమానించిన వాళ్ల ఆట కట్టించిన తమ్ముడు.. ఇప్పుడు సగర్వంగా ఆయన ముందు నిల్చున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది కేవలం టీజర్ మాత్రమే అని.. ఇంకా ట్రైలర్, సినిమా ముందు ముందు చూసిస్తారని అభిమానులు వైసీపీకి వార్నింగ్ ఇస్తున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు పవన్ మీద కక్షతో సినిమా వాళ్లను వేధించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేటును 5 రూపాయలు చేశారు. దీంతో కొంతమంది సినిమా వాళ్లతో కలిసి జగన్‌తో సమావేశమైన చిరంజీవి చేతులు జోడించి మరీ జగన్‌ను వేడుకున్నారు. పెద్దమనిషి హోదాలో ఉన్న తమరు పెద్ద మనసుతో ఆదుకోవాలని చేతులు జోడించి మరీ అడుగుతున్నానని చిరంజీవి అన్నారు. అయినా అహంకారంతో జగన్ పట్టించుకోలేదు. ఆ అవమానంతో రగిలిపోయిన పవన్ ఎన్నికల సమరంలో జగన్‌ను పాతాళానికి తొక్కేశారనే టాక్ వినిపిస్తోంది.