టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలయ్యాక.. దీన్ని బాగా ఉపయోగించుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అని చెప్పాలి. గత ఏడాది ‘పోకిరి’ సినిమాతో ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ అభిమానులే అయినా.. ఆ తర్వాత జల్సా, ఖుషి, తొలి ప్రేమ చిత్రాల రీరిలీజ్‌ను పవన్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్న తీరు.. వాటికి వచ్చిన వసూళ్లు చూసి అందరూ షాకయ్యారు. ముఖ్యంగా జల్సా, ఖుషి సినిమాల్లో ఫ్యాన్ మూమెంట్స్‌కు లోటు లేకపోవడంతో అభిమానుల హంగామా పీక్స్‌లో కనిపించింది.
ఐతే వీటిని మించిన సినిమా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌ను తిరిగి సంబరాల్లో ముంచెత్తడానికి రాబోతోంది. ఆ మూవీనే.. గబ్బర్ సింగ్. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ‘గబ్బర్ సింగ్’ నిర్మాత బండ్ల గణేషే వెల్లడించాడు. ఈ మేరకు ఒక ట్వీట్ వేశాడు.
బండ్ల ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది. పవన్ అభిమానులను ఎంతగానో ఎగ్జైట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ సైతం ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్‌పై తన సంతోషాన్ని ప్రకటించాడు.
పవన్‌కు ‘ఖుషి’ తర్వాత పదేళ్ల పాటు ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ లేదని అభిమానులు ఆవేదన చెందుతున్న సమయంలో 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సెన్సేషనల్ హిట్టయింది. సినిమా పెద్ద హిట్టవడం ఒకెత్తయితే.. ఈ సినిమా థియేటర్లలో పవన్ అభిమానుల సంబరాలు మరో ఎత్తు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ వాళ్లు రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పవన్ కెరీర్లో ఎన్ని బ్లాక్బస్టర్లున్నా.. ‘గబ్బర్ సింగ్’ చాలా స్పెషల్. ఆకలితో నకనకలాడిపోతున్న వారికి బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టినట్లుగా ‘గబ్బర్ సింగ్’ సాధించిన విజయానికి, అలరించిన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. అందుకే ఈ సినిమా రీ రిలీజ్ అంటే సెలబ్రేషన్స్ పీక్స్‌లో ఉంటాయనడంలో సందేహం లేదు.