వైసీపీ నేతలపై పవన్ బండ బూతులతో విరుచుకుపడ్డారు. విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనుకు వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు సృష్టించిన అడ్డంకుల నేపథ్యంలో ప్రభుత్వంపై జనసేన నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు జనసేనాని పవన్ పిలుపునిచ్చారు. అయితే, పవన్ ను ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతలు చాలాకాలంగా విమర్శిస్తున్నారు. విశాఖ టూర్ లో తనను హోటల్ గదికే పరిమితం చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్…తాజాగా వైసీపీ నేతలపై బండ బూతులతో విరుచుకుపడ్డారు.
మీడియా ముందే చెప్పు చూపిస్తూ మరీ వైసీపీ నేతలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ‘నా కొడకల్లారా.. మీకు మాములుగా ఉండదు.. సన్నాసుల్లారా.. వెధవల్లారా’ అంటూ మునుపెన్నడూ లేని రీతిలో పవన్ ఉగ్రరూపం దాల్చారు. ప్యాకేజీ స్టార్ అంటూ పిచ్చి మాటలు మాట్లాడితే లాక్కొని వచ్చి మరీ దవడలు పగిలేలా చెప్పు తీసుకొని కొడతానంటూ పవన్ హెచ్చరించారు. అరేయ్ వైసీపీ నా కొడకల్లారా అని సంబోధిస్తూ చెప్పును తిప్పి తిప్పి మరీ కొడతానంటూ పవన్ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాలలో కాక రేపుతున్నాయి.
‘ఏంట్రా మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు ఎందుకురా.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే మీరు నాకు చెబుతారా? నేను విడాకులు ఇచ్చి చట్టపరంగా చేసుకున్నాను. వెధవల్లారా కావాలంటే మీరు చేసుకోండి..పిచ్చి వాగుడు వాగితే నిల్చోబెట్టి తోలు తీస్తా నా కొడకల్లారా.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తీసుకుని కొడతా…నా కొడకల్లారా.. ఎక్కడికి వస్తారో రండి.. చూసుకుందాం.. ఇప్పటివరకు నా మంచితమే చూశారు.. ఇప్పటినుంచి నాలోని ఆవేశాన్ని చూస్తారు.. తేల్చుకుందాం రండి’ అని ‘ అంటూ వైసీపీ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ ఏరా వైసీపీ గూండాల్లారా.. ఇప్పటివరకు నాలోని సహనం, మంచితనమే చూపించాను. ఇక నుంచి వెధవ వాగుడు వాగితే ఇళ్లల్లో నుంచి బయటకు లాక్కొచ్చి మరీ కొడతా.. నాకు రాజకీయం తెలియదనుకుంటున్నారా?.. ఈ రోజు నుంచి యుద్ధం మొదలు పెడుతున్నా.. రాళ్లా.. రాడ్లా.. దేనితోనైనా యుద్దానికి సిద్దం.. మీరు రెడీనా?.. నన్ను గొడవలోకి లాగితే నాలుక చీరేస్తా సన్నాసుల్లారా.. ప్యాకేజీ తీసుకున్నాడనే సన్నాసి కొడుకులు ఎవరు.. ఒక్క చేత్తో గొంతు పిసికి చంపేస్తా’’అంటూ పవన్ గతంలో ఎన్నడూ చేయని విధంగా బూతులతో వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు.
‘‘మరోసారి ప్యాకేజీ అంటే పళ్లు రాలగొడతా.. చెప్పు తీసుకుని కొడతా.. ఈ వైసీపీ గాడిదలకు బూతు మాటలు తప్పితే ఏమీ తెలియదు.. వెధవల్లారా.. చవటల్లారా.. నేను బాపట్లలో తిరిగా.. ఉప్పు.. కారం తిన్నా.. గొడ్డు కారం తిని పెరిగా.. నాలోని పౌరుషం ఇక నుంచి చూపిస్తా.. పిచ్చిపిచ్చి వాగుడు వాగకండి.. బూతు పంచాంగం చెప్పే వైసీపీ నేతలకు ఇదే నా హెచ్చరిక.. ‘ అంటూ వైసీపీ నేతలకు పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
‘అన్ని కులాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను.. కులాలు రెచ్చగొట్టాలని చూస్తే నరికి చంపేస్తా.. నేను వాహనం కొంటే ఎవరో ఇచ్చారని విమర్శిస్తారా.. అరెయ్ ఎదవల్లరా మీకు నా సంపాదన ఎంతో తెలుసా? వంద నుంచి 120 కోట్లు సంపాదించా.. నా పిల్లల పేరు మీద డిపాజిట్ చేసిన డబ్బుతో పార్టీ కార్యాలయం కట్టా.. రూ.33.37 కోట్లు ఇన్ కం ట్యాక్స్ కట్టాను.. అయోధ్య రామాలయానికి ఫండ్ ఇచ్చాను.. జీఎస్టీ అదనంగా చెల్లించా’’ అని తనను ప్యాకేజీ స్టార్ అని విమర్శిస్తున్న వైసీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు జాతీయ రాజకీయాలలోనూ చర్చనీయాంశమయ్యాయి.