ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జగన్ పై పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే పట్టించుకోని, సొంత చెల్లి జీవితాన్నే బయటికి లాగిన దిగజారుడు వ్యక్తి ఉన్నాడని జగన్ పై షాకింగ్ ఆరోపణలు చేశారు.అ.. సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా? అని ప్రశ్నించారు.
భార్యాపిల్లలను కిడ్నాప్ చేస్తే వైసీపీకి చెందిన సొంత ఎంపీనే రక్షించుకోలేకపోయాడని, సొంత కుటుంబాలనే రక్షించుకోలేనివాళ్లు ప్రజల జీవితాలకు ఏం భద్రత ఇస్తారని పవన్ నిలదీశారు. రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలండవని, ప్రజలు నమ్మకంతో ఓటేస్తారని అన్నారు. ఈ ముఖ్యమంత్రి వేలు చూపించి సిద్ధం సిద్ధం అంటున్నాడు… దేనికయ్యా సిద్ధం నువ్వు? మేం కూడా సిద్ధం. ఓటేసి కింద తుంగలో తొక్కడానికి మేము సిద్ధం అని పవన్ అన్నారు.
నువ్వు వేలు చూపించి ఎవడ్ని బెదిరిస్తున్నావు? నేను సినిమాల్లో వేలు చూపించే ఫొటోలకు పోజులివ్వడానికే ఆలోచిస్తాను… అలాంటిది ఈయన సిద్ధం అంటే మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు అని పవన్ ఎద్దేవా చేశారు.