రాజకీయాల్లో ఎవరూ కూడా వచ్చిన అవకాశాన్ని వదు లుకునే ప్రయత్నం చేయరు. కానీ, అదేంటో.. పవన్మాత్రం చేతికి అందివచ్చిన అవకాశాన్ని వదులు కుంటున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఉదాహరణకు.. కాపులను తీసుకుంటే.. వారంతా కూడా.. పవన్ వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. పవన్‌కు జైకొడుతున్నారు. పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. తమ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇప్పట్లో ఎవ్వరికి ఉండదని.. అయితే అది ఒక్క పవన్‌తోనే సాధ్యం కావచ్చని అంటున్నారు.
రాజకీయాల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని.. పార్టీలు.. నాయకు లు కూడా కోరుకుంటారు. అదే దిశగా అడుగులు కూడా వేస్తారు. అవసరమైతే.. త్యాగాలు చేయాలని కూడా అంటున్నారు. మరి ఇలాంటి చక్కని అవకాశం దక్కించుకున్న పవన్ .. ఇప్పటి వరకు కాపులతో భేటీ అయింది లేదు. వారిని ప్రత్యేకంగా పిలిచి చర్చించింది కూడాలేదు.
ఇక, మెగా అభిమానులు. మెగా కుటుంబానికి రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతమైన అభిమాన సంఘాలు ఉన్నాయి. 2019 ఎన్నికల విషయాన్ని పక్కన పెడితే.. ఇటీవల కాలంలో వీరంతా కూడా .. పవన్‌కు జై కొడుతున్నారు. `మేం మీ కోసం` అనే టైటిల్‌తో విజయవాడలో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కు పనిచేయాలని..ఆయనను గెలిపించాలని తీర్మానం కూడా చేసుకున్నారు.
మరోవైపు.. కేవలం రామ్ చరణ్ అభిమానులు కూడా ఇటీవల హైదరాబాద్ వేదికగా భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను గెలిపించాలని తీర్మానం చేసుకున్నారు. మరి ఇలాంటి సంఘాలను చేరువ చేసుకుని.. వారిని సైన్యం మాదిరిగా వినియోగించుకునేందుకు పవన్ ఇప్పటి వరకు ఒక్క సమావేశం నిర్వహించలే దు. పోనీ.. వారిని వద్దను కుంటున్నారో.. కావాలనుకుంటున్నారో కూడా చెప్పడం లేదు. దీంతో ఈ వర్గాలు.. ఏం చెబుతారా? అని ఎదురు చూస్తున్నాయి. మరి ఇప్పటికైనా. పవన్వీరిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి.