ఏపీలో అధికారంలోకి వస్తామని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు.. క్షేత్రస్థాయిలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే.. పవన్ క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. కానీ, వైసీపీ నాయ కులు మాత్రం క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు పర్యటిస్తే.. ఏం చేయాలనే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నా రు. ఈ క్రమంలోనే పవన్‌ను నిలదీయాలంటూ.. ప్రజలకు కూడా కొన్ని నూరిపోస్తున్నారు.
ఈ క్రమంలో పవన్‌ను నిలదీసేందుకు ఓ వర్గం ప్రజలు రెడీగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. ప్రధానం గా ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. ఏపీకి ఏం చేశారని ప్రశ్నలు.. వస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయాన్ని గాలికి వదిలేశారని, పోలవరం నిధులపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తు న్నారు. ఇటీవల మోడీతో భేటీ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు దానిని వదులుకు న్నారని అంటున్నారు.
మోడీతో భేటీ అయినప్పుడు.. పవన్ కేవలం తన రాజకీయాలు మాట్లాడుకున్నారే తప్ప.. ఏపీకి సంబంధిం చిన సమస్యలపై నోరు విప్పలేదని.. ఓ వర్గం ఆరోపిస్తోంది. నిజానికి అధికారంలో లేకపోయినా.. బీజేపీతో పొత్తును వినియోగించుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు పోరాడకూడదనే సందేహాలు కూడా వస్తున్నాయి. రాష్ట్రానికి అధికారం కోసం కాదు.. అభివృద్ధి కోసం వస్తున్నానని చెప్పే పవన్.. ఇలా ఎందుకు చేస్తున్నారని అంటున్నారు.
వాస్తవానికి వీటిని వైసీపీ నాయకులు చెబుతున్నారని అనుకున్నా.. ఈ వాదనలోనూ నిజం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఎలానూ.. గత చంద్రబాబు చేయలేక పోయారు. ఇప్పుడు జగన్ కూడా చేయలేకపోతున్నారు. సో.. ఇక, ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం.. పవన్ అని భావిస్తున్న సమయంలో ఆయన వీటి కోసం ఫైట్ చేసి.. ఇదిగో నేను అధికారంలో లేకపోయినా.. ఏపీపై పోరాడుతున్నాను.. రేపు అధికారం ఇస్తే.. ఏపీకి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పుకొనే అవకాశం దక్కేదని అంటున్నారు పరిశీలకులు. కానీ, ఆయన చేయడం లేదు. చేస్తారన్న ఆశలు కూడా లేవు.