మీడియాతో మాట్లాడినపుడు జనసేన మొహం చూసిన తర్వాత ఇదే అనుమానం వచ్చిందందిరికీ. ఎందుకంటే సోమవారం సాయంత్రం పవన్ +నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి చేరుకుంటే బుధవారం సాయంత్రానికి కానీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇంటర్వ్యూ దొరకలేదు. మరి మధ్యలో 36 గంటల పాటు పవన్ ఏమి చేశాడో ఆయనకే తెలియాలి. అసలు అంత అర్జంటుగా హైదరాబాద్ నుండి పిలిపించిన నడ్డా 36 గంటలు పవన్ను ఎందుకు వెయిట్ చేయించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
సరే వాళ్ళ గోలేదే వాళ్ళే పడతారులే అనుకుంటే బుధవారం సాయంత్రం పవన్ మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికల్లో సీటుపై చర్చించేందుకు ఢిల్లీకి రాలేదన్నారు. మరి ఎందుకు నడ్డాను కలిశారయ్యా అంటే రాష్ట్రప్రయోజనాల కోసమట. ఎవరైనా నమ్ముతారా పవన్ చెప్పిన మాటలను ? ఇప్పటికప్పుడు నడ్డాతో రాష్ట్రప్రయోజనాల కోసం పవన్ చర్చించే అంశాలు ఏమున్నాయో ? ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే సమయంలో తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి కూడా చర్చించినట్లు మళ్ళీ పవనే చెప్పారు.
ముందేమో ఉపఎన్నికల విషయం మాట్లాడేందుకు రాలేదని చెప్పిన పవన్ కొద్ది సేపటిలోనే ఉపఎన్నికలపై మాట్లాడినట్లు చెప్పటం ఏమిటో ? అసలు తానేం మాట్లాడుతున్నాడో పవన్ కైనా అర్ధమవుతోందా ? ఉపఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే విషయంపై ఓ కమిటి వేశారట. కమిటిని వేసిందెవరు ? కమిటిలోని సభ్యులెవరు ? అన్న విషయాలను మాత్రం పవన్ చెప్పలేదు. పోనీ కమిటి రిపోర్టు ఎప్పటిలోగా తన నివేదికను ఇస్తుందో కూడా చెప్పలేదు.
ఇక్కడ వస్తున్న అనుమానం ఏమిటంటే గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని కూడా వదిలిపెట్టి అసలు పవన్ ఢిల్లీకి ఎందుకంత అర్జంటుగా వచ్చారు ? హస్తినలో కూర్చుని ఏమి చేశారు ? గ్రేటర్ లో ప్రచారాన్ని కూడా వదిలిపెట్టేసి ఢిల్లీకి వచ్చేంత అత్యవసరం ఏమిటో ఎవరు చెప్పలేకున్నారు. మొత్తం మీద పవన్ మొహంలో హావభావాలు చూసిన తర్వాత ఢిల్లీ టూర్ పెద్దగా వర్కవుట్ కాలేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరెందుకు వచ్చారు ? వచ్చి ఏం చేశారు ? అనే విషయాలు మెల్లిగా బయటపడతాయేమో చూడాల్సిందే.