జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై క్లారిటీ వచ్చింది. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అదేసమయంలో పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తారని వస్తున్న వార్తలకు కూడా జనసేనాని ఫుల్ స్టాప్ పెట్టారు. తనకు పార్లమెంటుకు వెళ్లాలన్న ఆశలేదన్నారు. అసెంబ్లీలో అయితే, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో అవకాశం ఉంటుంద ని తెలిపారు. అంతుకే తాను పిఠాపురం ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన స్పష్టత ఇచ్చా రు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి చేయమని అడిగారని ఆయన వెల్లడించారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీ చేయమంటూ తనకు వినతులు వచ్చాయని అన్నారు.
అయితే రాష్ట్రం కోసం ఆలోచించి అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని అన్నారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను అక్కడి నుంచి ప్రారంభించానని అన్నారు. కాగా గత ఎన్నికల్లో జనసేనా భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు చోట్టా పవన్ ఓడిపోయారు.
అయితే.. ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమనే వాదన రెండు మూడు మాసాల నుంచి వినిపిస్తూనేఉంది. దీనికి కారణం ఇక్కడ 90 వేల మంది కాపు ఓటర్లు ఉన్నారు. దీంతో పవన్‌కు కళ్లు మూసుకుని వారంతా ఓటు వేస్తారనే వాదన రాజకీయంగా వినిపించింది. ఇప్పుడు తాజాగా పవన్ కూడా చెప్పిన విషయాన్ని బట్టి ఈ దఫా ఎలాగైనా అసెంబ్లీకి అడుగు పెట్టాలనే వ్యూహంలో భాగంగానే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.