రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులుగా చెప్పే కీలక నేతల్లో పటేల్ రమేష్ రెడ్డి ఒకరు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలో రేవంత్ అనుచరులు అందరికీ దాదాపుగా సీట్లు వచ్చినా అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డిలకు సీట్లు రాలేదు.
సీటు రాకపోవడంతో రమేష్ రెడ్డి అప్పట్లో కన్నీరు పెట్టుకున్నారు.
ఆ సమయంలో రమేష్ రెడ్డిక కీలక హామీ దొరికిందని.. దాంతోనే ఆయన చల్లబడ్డారని అంటారు. లోక్ సభ ఎన్నికలలో నల్గొండ టికెట్ ఇస్తామన్న హామీతోనే ఆయన అప్పట్లో సూర్యాపేటలో ఆయన పార్టీ విజయానికి సహకరించారని అంటారు.
అయితే… రమేష్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మరోసారి షాకిచ్చింది.
అప్పట్లో సూర్యాపేట టికెట్ ఇవ్వని సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు.
కానీ, కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో నల్గొండ ఎంపీ టికెట్‌ను జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డికి కేటాయించింది. దీంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది.
ఇన్నాళ్లు అదే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పటేల్ రమేష్‌రెడ్డికి మళ్లీ నిరాశే ఎదరైంది.
ఈ క్రమంలో ఆయన పక్కాగా పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది.
తన సహచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
నల్గొండ జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీ.. పటేల్ రమేష్‌రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకుంటే బలం పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సమాచారం అందజేశారు.
అందుకు బీజేపీ అధిష్టానం కూడా పటేల్ రమేష్‌రెడ్డి చేరికకు ఓకే చెప్పారని టాక్.
ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి పటేల్ రమేష్ రెడ్డి బీజేపీలో చేరుతారా.. లేక కాంగ్రెస్‌లోనే ఉంటూ అవమానాలను భరిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.