పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం విజయవంతంగా ముగిసినందుకు తానా వ్యవస్థాపకులకు ,
తానా నాయకత్వానికి, ఉపాధ్యాయులకు , కోఆర్డినేటర్లకు , రీజినల్ రెప్రజెంట్స్ కు వెబ్ టీమ్ కు మరియు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. గత విద్యా సంవత్సరంలో 1750 మందికి తెలుగు నేర్పగలిగామని, సెప్టెంబర్ చివరి నాటికి అంతకు మించిన లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచిన ప్రసాద్ మంగిన ను ప్రత్యేకంగా అభినందించారు.
రవి పోచిరాజు ఆలపించిన ప్రార్థన గీతంతో మొదలైన కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదట తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడారు.
గత సంవత్సరం విజయవంతంగా ముగిసినందుకు వాలంటీర్లకు, టీచర్లకు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. గత సంవత్సర కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పాఠశాల టీం విజయవంతంగా పిల్లలకు తెలుగు నేర్పించగలిగారని ఆయన అభినందనందించారు.
పాఠశాల టీం అంతా అవిశ్రాంతంగా కృషి చేయడం వలనే సుమారుగా 2000 మంది విద్యార్థులకు తెలుగు నేర్పగలిగామన్నారు. పాఠశాల టీం లో ఉన్న కోఆర్డినేషన్ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తానా అన్ని విధాలుగా పాఠశాలకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కేవలం పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మనసా వాచా కర్మణా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అందరూ శ్రమించగలిగితే సుమారు 5000 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొనే లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. పాఠశాలకు ఏ సమయంలోనైనా షరతులు లేని సహకారాన్ని అందిస్తామనడం విశేషం. తానా నాయకత్వంగా తాము ఏమి చేయాలో మీరు చెప్పాలని పాఠశాల టీం ను ఆయన కోరారు.
తానా పూర్వ అధ్యక్షులు, అలాగే పాఠశాలను తానాలో విలీనం చేసేందుకు కృషి చేసిన జయ తాల్లూరి మాట్లాడుతూ మాతృభాష పిల్లలకు నేర్పడం కోసం పాఠశాల చేస్తున్న కృషిని ఆయన ఎంతగానో ప్రశంసించారు.
“మాతృభాష అనేది ఒక నినాదం కాదని మాతృభాష అనేది ఒక జీవన విధానం” అని ఆయన కొనియాడారు. 8 సంవత్సరాలుగా పాఠశాల నిరంతరాయంగా కృషి చేస్తున్నదని, రెండు సంవత్సరాల క్రితం దీనిని తానాలో విలీనం చేసుకున్నామని చెప్పారు. ఆ అవకాశం తాను తానా అధ్యక్షులుగా ఉన్నప్పుడు జరిగిందన్నారు భవిష్యత్తులో పాఠశాలను ఒక విశ్వవిద్యాలయంగా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు.
తానా సెక్రటరీ సతీష్ వేమూరి ఇది తానా నుండి అద్భుతమైన నిర్వహణ అని పేర్కొన్నారు. మరియు వారు దీనికి పూర్తిగా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా కేవలం 100 డాలర్లకే మొత్తం విద్యా సంవత్సరాన్ని విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు.
పాఠశాల వ్యవస్థాపకులు వెంకట సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ 2013 అక్టోబర్ న బే ఏరియాలో మనం ఏదైనా చేద్దామనుకున్న సందర్భంలో కలిగిన ఆలోచన ఫలితంగా పాఠశాల ఏర్పాటయిందన్నారు. మొదట్లో పాఠశాల ప్రారంభించినప్పుడు అమెరికాలో తెలుగు పిల్లలకు చాలా సులభంగా తెలుగు నేర్పాలనుకున్నామని చెప్పాడు.
పాఠశాలలో పలుకు, అడుగు, పరుగు, వెలుగు ఏర్పాటు చేయడానికి గల కారణాన్ని ఆయన సవివరంగా తెలియజేశారు.
బాట అడ్వజర్ విజయ మాట్లాడారు. పాఠశాల టీం చేస్తున్నటువంటి కృషిని ఆమె అభినందించారు .
ప్రపంచవ్యాప్తంగా నేడు తానా పాఠశాల విస్తృతమైన ఆదరణ పొందుతుందని ఆమె కొనియాడారు. పాఠశాలను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రతి రీజియన్ నుండి ఉపాధ్యాయులు తమ అనుభవాలు పంచుకున్నారు. ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు సమస్యల గురించి ప్రతి ఒక్కరూ క్లుప్తంగా మాట్లాడారు.
కాళీ ప్రసాద్ & కొలంబస్ బృందం
ఫణి కంతేటి
బిల్హన్ ఆలపాటి
రజనీ మారమ్ (ఆస్టిన్ టీమ్)
వెంకట్ కొర్రపాటి
డాక్టర్ తవ్వా
హైమా నివేదిత
అనిల్ పెండ్యాల & బృందం (అయోవా & చికాగో)
పార్థ పరిటాల (మేరీల్యాండ్)
రామ్ తోట (బే ఏరియా)
సౌజన్య పొట్టి
హరి (సియాటెల్ టీమ్ – వాట్స్)
సునీల్ దావరపల్లి (సౌత్ ఈస్ట్ రీజియన్)
ప్రతాప్ చెరుకూరి (LA)
దిలీప్ ముసునూరు, కృష్ణ వేణి, రమ్యప్రభ (న్యూయార్క్ జట్టు)
వెంకట్ సద్గు (మిసిసిపీ టీమ్) , ధన, రాగిణి , మమత , విజయ గోపరాజు, హేమ లత
లక్ష్మీ పాపినేని (మిస్సోరి), రాజీ నాళం, శ్రీలక్ష్మి పైడి, శ్రీని ఇరుగంటి, జాహ్నవి.
చివరిగా విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎంత సులభంగా తెలుగు బోధించవచ్చు అనే అంశం పైన శ్రీదేవి తో ఓరియంటల్ కార్యక్రమాన్ని కొనసాగించారు.
శ్రీదేవి పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలకు తెలుగు నేర్పే విధానాన్ని చాలా చక్కగా వివరించారు.
అలాగే వెలుగు తరగతులు పూర్తి చేసిన పిల్లలను భవిష్యత్తులో పాఠశాల కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసే ఆలోచన చేస్తున్నామని పాఠశాల టీం సభ్యులందరూ తెలియజేశారు .