పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. అతను అంతటితో ఆగకుండా వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
అతను గోపాలపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మతి స్థిమితం సరిగా లేకపోవడంతోనే అతను ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని స్థానికుల ద్వారా తెలిసింది. అతను జనసేనకు జై కొడుతున్నాడు.
టీడీపీ, బీజేపీ, వైసీపీ ని తీవ్రంగా దూషిస్తున్నాడు. పూర్తి వివరాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.
????????????????????started ????https://t.co/8YcyFvaiCF
— ????????????????????????????????????????®️ (@prasana_kumar) May 4, 2022