అవును పరిటాల రవి ఫ్యాక్షనిస్టు
పరిటాల రవి తండ్రి పీడిత ప్రజల కోసం తన ఆస్తులు పంచితే
పరిటాల రవి వారికోసం తన జీవితమే త్యాగం చేశారు.
ధర్మవరం పరిసర ప్రాంతాల్లో ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు పిల్లకు పదేళ్లు రాగానే ఊళ్లొదిలి పోతున్న దుర్మార్గపు రోజులవి. ఒక పోరంబోకును అక్కడ రాజకీయ నాయకుడిని చేసిన కాంగ్రెస్…. అక్కడ కనిపించిన ఆడపిల్లనల్లా మానభంగం చేసి చంపి చెరువులో పడేస్తే గట్టిగా ఏడవలేని తల్లిదండ్రుల దయనీయ పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరు ఆ నరకాసురుడి వధ కోసం దేవుడ్ని ప్రార్థించని రోజు లేదు.
ఆ నరకాసురుడిని వధించే ప్రయత్నంలో ఆడపిల్లలు హాయిగా బడులకు, కాలేజీలకు వెళ్లే స్వేచ్ఛ కలిపించే క్రమంలో పరిటాల రవి ఎత్తిన కత్తి ఆయన్ను ఫ్యాక్షనిస్టును చేసింది. ఒక నీచుడి నుంచి ధర్మవరం ప్రాంతపు ఆడపిల్లల జీవితాలకు విముక్తి కల్పించి, వారి తల్లిదండ్రులకు ప్రశాంత కలిగించిన రవి చేసిన యుద్ధం ఆయనను మాత్రం ఫ్యాక్షనిస్టును చేసింది.
ఆ రాజకీయ కుట్రల్లో ఆయన మీద ఎన్ని ముద్రలు పడినా అనంతపురం జిల్లా ఆడపిల్లల ఆశీసుస్సులు ఆ కుటుంబంతోనే ఉన్నాయి. ఈరోజు పరిటాల రవి వర్ధంది.
జీవితమంతా పీడితప్రజలకు అంకితం చేసిన పరిటాల రవి కుటుంబం నేపథ్యం తెలుసుకుని ఇంటికెళ్లి మరీ పరిటాల రవిని బలవంతం చేసి ఎన్టీఆర్ రాజకీయం వైపు నడిపించారు. ఎప్పటిలాగే ప్రత్యర్థులు చేసే పనికిమాలిన విమర్శలకు అధికంగా భయపడే చంద్రబాబు ఆయన కు సరైన సమయంలో పదవి ఇవ్వలేక ప్రత్యర్థులు ఎదిగే అవకాశం ఇచ్చారు.
అదే నీచపు రాజకీయానికి జనవరి 24, 2005న పరిటాల రవి హతమయ్యారు. బావ కళ్లలో ఆనందం చూసిన వాడు ఒకడు, రామకోటి రాసుకుంటూ వాడిని చంపినవాడు ఇంకొకడు. ఇదొక్కటి చాలు రవిది రాజకీయ హత్య అని చెప్పడానికి !!
20 ఏళ్లు కావస్తున్నా పరిటాల రవిని ఈ లోకం మరిచిపోలేదు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. పరిటాల ఘాట్ వద్ద ఆయన కుటుంబం నివాళులు అర్పించింది.