పుట్టిన రోజు పండగే అందరికీ! అన్నట్టుగా ప్రముఖ ఆధ్యామిక వేత్త “పండిట్ ఉమాశంకర్ దీక్షిత్” జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ నగరంలో ఉన్న శ్రీసిద్ధి వినాయక దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు వారు భారీ సంఖ్యలో హాజరై.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
“పండిట్ ఉమాశంకర్ దీక్షిత్”.. అమెరికాలోని తెలుగువారికి అత్యంత సుపరిచితులు.
కాలిఫోర్నియాలోని ఫ్రెమాంట్ నగరంలో శ్రీసిద్ధి వినాయక దేవాలయాన్ని నిర్మించి.. ఇక్కడివారికి స్వామి దర్శన భాగ్యం కల్పించారు.
ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా “పండిట్ ఉమాశంకర్” దీక్షిత్ పేరు తెచ్చుకున్నారు.
తెలుగు వారిఆధ్యాత్మిక సారథిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం 64 ఏడులోకి అడుగు పెట్టిన “పండిట్ ఉమాశంకర్ దీక్షిత్”కు స్థానిక భక్తులే కాకుండా.. అన్ని ప్రాంతాల్లోని తెలుగు వారు తరలివచ్చి.. ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
వయసుతో సంబంధం లేకుండా ఆయన నేటి తరానికి మార్గదర్శిగా ఉన్నారని పలువురు కొనియాడారు.
మరిన్ని సంవత్సరాలు ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
కాగా, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ “పండిట్ ఉమాశంకర్ దీక్షిత్” ధన్యవాదాలు తెలిపారు.