మహిళల కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మహిళలు కెరియర్ కు ఎంతో ఉపయోగపడే ఈ నిర్ణయం వల్ల అమ్మాయిలు చదువులు పూర్తి చేసుకుని స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉంది. అలాంటి ఈ నిర్ణయంపై ఒవైసీ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదు.
మోడీ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. 18 ఏళ్ల వయసు పురుషులు, మహిళలు ఇద్దరూ చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి అనుమతించాలని హైదరాబాద్ ఎంపీ ఒవైసీ డిమాండ్ చేశారు.
మహిళల కనీస వివాహ వయస్సు పెంపు ప్రతిపాదనకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పౌష్టికాహార లోపం నుంచి మహిళలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ముస్లిం పేద మహిళలతో పాటు అన్ని మతాల్లోను పేద మహిళలు వివాహ బంధం వల్ల బానిసలు అవుతున్నారు. దీనిని నివారించేందుకు కొత్త నిర్ణయం ఉపయోగపడుతుంది.
అయితే… ఇది ముస్లిం జనాభాను తగ్గించే ప్రమాదం ఉందని ఒవైసీ భయపడుతున్నారా? లేకపోతే ఈ చట్టంపై ఆయన స్పందించడం ఏమిటి? ఇదేమీ ఒక మతస్తుల కోసం చేసిన చట్టం కాదు కదా. దేశంలో 130 కోట్ల మందికి వర్తించే చట్టం ఇది. కానీ ఒవైసీ మాత్రమే దీనిపై ఎందుకు స్పందిస్తున్నారని పలువురు విస్మయం చెందుతున్నారు.