జనాలు ఎప్పటి నుండో కోరుకుంటున్న సెన్సార్ షిప్ ఇకనుండి ఓటీటీలకు కూడా వర్తింప చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఓటీటీ వేదికలతో పాటు ఇతర వెబ్ ఛానళ్ళతో పాటు వెబ్ సైట్లు, ఆన్ లైన్ వార్తా ఛానళ్ళకు కూడా ఇకనుండి సెన్సార్ షిప్ విధిించే బిల్లుపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవిడ్ సంతకం చేసేశారు. నిజానికి ఈ పని కేంద్రప్రభుత్వం ఎప్పుడో చేయాల్సిందనే అభిప్రాయం జనాల్లో విస్తృతంగా ఉంది. కానీ ఎందుకనో ఇంతకాలం ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
ఓటీటీ ప్లాట్ ఫారం, వెబ్ ఛానళ్ళ పేరుతో మనదేశంలో ఈ మధ్య అ-డల్టు కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. సినిమాలకు సెన్సార్ షిప్పు ఉన్నట్లే ఓటీటీ ప్లాట్ ఫారాలు, వెబ్ ఛానళ్ళకు సెన్సార్ షిప్పు ఉండటం లేదన్న విషయంలో జనాలు మండిపోతున్నారు. ఓటీటీ, వెబ్ ఛానళ్ళ పేరుతో విపరీతమైన అశ్లీలాన్ని జనాల మీదకు వదిలేస్తున్నారు కంటెంట్ నిర్మాతలు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం లాంటి విదేశీ ప్లాట్ ఫారాలే కాకుండా స్వదేశంలోని ప్లాట్ ఫారాలు కూడా చాలానే ఉన్నాయి.
నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫారంలో అయితే ఎక్కువగా విదేశీ సినిమాలు, వెబ్ సీరీసులే ఉంటున్నాయి. వీటిల్లో కొన్నింటిలో విపరీతమైన హింస, అ-డల్టు కంటెంట్ ఉంటోందని జనాలు గోల చేసేస్తున్నారు. అమెజాన్ ప్రైంలో మాత్రం ఈ సమస్య అంతగా లేదనే చెప్పాలి. అలాటే స్వదేశీ ప్లాట్ ఫారాలలో చాలా వాటిల్లో ప్రత్యేకించి హిందీ వెబ్ సీరీసుల్లో హింస, అ-డల్టు కంటెంట్ వెగటుపుట్టే రీతిలో పెరిగిపోతోంది. హిందీ, తమిళం భాషల నుండి అనువాదాలయ్యే సీరీసుల్లో అయితే డైలాగుల్లో యధేచ్చగా బూ-తులు వాడేస్తున్నారు.
కుటుంబం అంతా కూర్చుని వెబ్ సీరీసులు చూడాలంటేనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు సీరీసుల్లో లేని అ-డల్టు కంటెంటు, బూ-తులు ఇతర భాషల్లో ఉండటం వల్ల వాటిని డబ్బింగ్ చెప్పించటానికి బాగా గిరాకీ ఉంటోందని కంటెంట్ నిర్మాతలు భావిస్తున్నట్లున్నారు. సినిమాల్లో బూ-తులుంటే సెన్సార్ ద్వారా తొలగించే వ్యవస్ధ ఉండటం వల్ల ఇబ్బందులు ఉండటం లేదు.
కానీ ఈ ప్లాట్ ఫారంలకు మాత్రం ఇప్పటివరకు సెన్సార్ షిప్ లేకపోవటంతో వాటి కంటెంట్ నిర్మాతాలకు ఇష్టారాజ్యంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని చివరకు ఓటీటీ, వెబ్ ఛానళ్ళకు కూడా సెన్సార్ షిప్ తీసుకురావటం సంతోషిచ్చదగ్గ విషయమే.