పైనున్న ఫొటోను నిశితంగా పరిశీలించండి….మీకేమీ అర్థం కాకపోవచ్చు. కానీ, కింద ఉన్న మ్యాటర్ చదివితే కచ్చితంగా క్లారిటీ వస్తుంది.
పై ఫొటోలో మొదటి సగం గురించి..
మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే, కట్టుబ్టలతో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబును ప్రజలు ఎన్నుకున్నారు. ఆ నమ్మకానికి తగ్గట్లుగానే భారత్ లో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు తన 43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి అభివృద్ది ప్రణాళికలు రచించారు.
ఆ క్రమంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించేందుకు చంద్రబాబు అహరోరాత్రులు కష్టపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం ఎన్నో రకాల డిజైన్లు..మరెన్నో మోడళ్లు..పరిశీలించారు. వందలాది మంది ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లతో నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు. అలా అమరావతి మాస్టర్ ప్లాన్ పై నిపుణులతో చర్చిస్తున్న సందర్భంలో తీసిన ఫొటో ఒకటి.
పై పోటోలో రెండో సగం గురించి..
కట్ చేస్తే.. 2019లో జగన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత అమరావతిని జగన్ ఏ విధంగా మూలన పడేశారన్నది తెలిసిందే. ఇక, తాజాగా పులివెందుల రాణితోపు సమీపంలో నెలకొల్పిన ఆక్వాహబ్ను ప్రారంభించారు. ఆక్వాహబ్లోని చేపలు, రొయ్యలు, మత్స్య వంటకాలను జగన్ చాలా సీరియస్ గా పరిశీలించారు. తొట్టిలో పెట్టిన చేపలు, రొయ్యలపై జగన్ ఆరా తీశారు. ఆ చేపలు, రొయ్యల గురించి అధికారులు జగన్ కు సవివరంగా వివరించారు.
దీంతో, ఈ ఫొటో పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. విజన్ ఉన్న ఒక సీఎం రాష్ట్రాభివృద్ధి కోసం, రాజధాని కోసం, భావి తరాల కోసం కష్టపడుతుంటే…పాలనపై కనీస అవగాహన లేని, ఏ మాత్రం విజన్ లేని మరో సీఎం మాత్రం చేపలు, రొయ్యలు అంటూ రాష్ట్రాన్ని చేపల మార్కెట్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ఒక్క ఫొటో చాలు జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటో చెప్పేందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఒక్క ఫొటో జగన్, చంద్రబాబుల గురించి పూర్తిగా చెప్పేస్తుందని సెటైర్లు వేస్తున్నారు.