బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ త్వరలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు.
ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా అలియా భట్ కనిపించబోతున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 25న విడుదల అయ్యేందుకు ముస్తాబు అవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు జక్కన్న జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే తాజాగా చిత్ర టీమ్ ఓ ప్రెస్‌మీట్ నిర్వహించగా.. అక్కడ అలియా భట్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భాష విషయంలో ఎన్టీఆర్ బాగా ఇబ్బంది పెట్టాడని అలియా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఎక్కడికి వచ్చినా ఎక్కువగా తెలుగులోనే మాట్లాడుతున్నాడని..అది తనకు అర్థం కాకపోవడంతో ఎవరైనా అనువాదించి చెబుతారా అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నవ్వుతూ చెప్పుకొచ్చింది.
దాంతో అక్కడే ఉన్న ఎన్టీఆర్ వెంటనే రియాక్ట్ అవుతూ.. మేము తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీలో కూడా మాట్లాడుతున్నాం. కానీ, నీకది అర్థం కావడం లేదంటూ కౌంటర్ ఇచ్చాడు. అయినా తగ్గని అలియా మీరేమి ఇంగ్లీష్, హిందీలో మాట్లాడట్లేదంటూ బదులిచ్చింది. మొత్తానికి వీరిద్దరూ ఫన్నీ సంభాషణ మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది.