అమెరికా డెలవేర్ రాష్ట్ర కౌన్సిలర్లు సత్యా పొన్నగంటి, సుధాకర్ తురగ, శ్రీధర్ ఆలూరు మరియూ విశ్వనాథ్ కోగంటి ల అధ్వర్యంలో మహిళలు యువకులు ఆబాలగోపాలం పాల్గొనగా, మిడిల్ టౌన్ డెలవేర్ లోని సత్యా పొన్నగంటి స్వగృహంలో మహానటుడు , గొప్ప మనిషి , రాజకీయ ధురందరుడు , ప్రజల ఆరాధ్యదైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల గుండె చప్పుడు అయిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
సభ జరిగినంత సేపూ అభిమానులు “జోహార్ ! ఎన్టీయార్” అంటూ మిన్నంటిన నినాదాలతో ఆద్యంతం హోరెత్తించారు.
ఈ సందర్భంగా ఆయన కళారంగానికి రాష్ట్ర ప్రజానీకానికీ చేసిన ఇతోధికసేవలను పలువురు కొనియాడి మరోసారి జ్ఞాపకం చేసుకోవటం జరిగింది .
ఆంధ్రరాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆ మహానుభావుని ఆశయాలకు పునరంకితమవుతూ మన దార్శనికుడు శ్రీచంద్రబాబుగారిని తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకురావటానికి తీవ్ర కృషి చేయాలనీ…చేస్తాం అనీ సభికులందరూ ముక్తకంఠంతో ప్రతిన పూనటం జరిగింది.