• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP-దుబాయ్‌లో ఘ‌నంగా ‘అన్న‌గారి’ శ‌త జ‌యంతి

admin by admin
May 25, 2023
in NRI
0
0
SHARES
297
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు వారి ఆరాధ్య దైవం.. అంద‌రి అన్న‌గారు ఎన్టీ రామారావు శ‌త జ‌యంతి వేడుక‌లు.. దుబాయ్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లోని అల్ ఖాసిస్ లో ఉన్న ఉడ్ లెమ్ పార్కు స్కూల్‌లో నిర్వ‌హించిన ఈ వేడుక‌ల‌కు ఏపీ నుంచి ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

వీరిలో మాజీ మంత్రి, రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మ‌హిళ విభాగం అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత, మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త రవి మందలపు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నాయ‌కుడు బుచ్చ చౌద‌రి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజ‌కీయాల్లో అన్న‌గారు చూపిన బాట‌లో తాను న‌డిచాన‌ని, అందుకే ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాన‌ని చెప్పారు. దాదాపు 4 ద‌శాబ్దాలుగా తాను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని  గోరంట్ల బుచ్చ‌య్య వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో అన్న‌గారితో త‌న ప్ర‌యాణం సుదీర్ఘంగా సాగింద‌న్నారు. రాజ‌కీయంగా బీసీల‌కు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అన్న‌గారు ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతా కాద‌న్నారు. బీసీల‌కు ఈ రోజు అనేక ప‌ద‌వులు ద క్కుతున్నాయ‌న్నా.. ఆర్థికంగా ఆ వ‌ర్గాలు బ‌లోపేతం అయ్యాయ‌య‌న్నా.. అన్న‌గారు తీసుకున్న నిర్ణ‌యా లేన‌ని తెలిపారు. అదేవిధంగా పేద‌ల‌కు ఎలా చేరువ కావాలో వారిని రాజ‌కీయంగా ఎలా ఆదుకోవాలో కూడా తాను అన్న‌గారి నుంచి నేర్చుకున్న‌ట్టు చెప్పారు.

తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో ప్ర‌త్య‌క్షంగా త‌న‌కు ప‌రిచ‌యా లు లేక‌పోయినా, ఆయ‌న అడుగు జాడ‌ల్లో తాను న‌డుస్తున్నాన‌ని చెప్పారు. శ‌క పురుషుడు జ‌న్మించిన‌ వందేళ్ల త‌ర్వాత నేటి యువ‌త ఎన్టీఆర్ గురించి స్మ‌రించుకోవ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు.

మాజీ మంత్రి కేఎస్ జ‌వ‌హ‌ర్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. త‌న‌లాంటి ద‌ళితుల‌కు ఆయ‌న రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌వ‌హ‌ర్ క‌విత‌ను చ‌దివి వినిపించారు. త‌న‌కు అన్న‌గారితో బుద్ద పూర్ణిమ సంద‌ర్భంగా జ‌రిగిన‌ ప‌రిచ‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి ప్రసంగిస్తూ తనకు మాత్రమే సాధ్యమైన పంచులతో అన్న గారి మీద అభిమానాన్ని చాటుతూ ఉర్రుతలూగించారు.

అమెరికా లో నివసిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త  రవి మందలపు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఎన్టీఆర్ వేసిన బాట‌లో అనేక మంది రాజ‌కీయాల‌లోకి వ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌జ‌క‌లు సేవ చేసే భాగ్యం క‌ల‌గ‌డాన్ని ఎన్టీఆర్ ఎంతో గౌర‌వంగా భావించార‌ని తెలిపారు. రూపాయి జీతం తీసుకున్న ఏకైక ముఖ్య‌మంత్రి ఆయ‌నేన‌ని తెలిపారు.

అన్న‌గారి శ‌త జ‌యంతి స‌భ‌కు స్థానిక తెలుగు ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఎక్కువ సంఖ్య‌లు పాల్గొన్నారు. అన్న‌గారి స్మృతుల‌ను మ‌న‌నం చేసుకున్నారు.

చివరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త రవి మందలపుని దుబాయ్ టీడీపీ అభిమానులు, గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమాన్ని విశ్వేస్వర రావు, దుబాయ్ ఎన్నారై అధ్యక్షులు, నిరంజన్ ఉపా అధ్యక్షులు, వాసు రెడ్డి, కార్యదర్శి, భాషా, గల్ఫ్ టీడీపీ సభ్యులు తదితరులు విజయవంతంగా నడిపించారు.

 

 

Tags: nri 100 yearsnri tdp dubai
Previous Post

అమరావతిలో `పనికిరాని` ప‌ట్టాల పండుగ‌.. సంబ‌రాల‌కు 10 కోట్లు

Next Post

‘టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్’ ద్వారా మరో ఎనిమిది మందికి ఉద్యోగాలు!

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా ముగిసిన ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025!

May 15, 2025
Andhra

APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు

May 12, 2025
Andhra

తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!

May 11, 2025
Andhra

అమరావతి రీలాంచ్: ప్రపంచ మీడియా దృక్కోణం!

May 3, 2025
Around The World

కాలిఫోర్నియాలో AIA ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు క్యాండిల్ లతో ఘన నివాళి

April 26, 2025
Load More
Next Post

'టిడిపి ఎంపవర్మెంట్ సెంటర్' ద్వారా మరో ఎనిమిది మందికి ఉద్యోగాలు!

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra