పరమ శివుడు.. వాడ్ని చూసి పొంగిపోవాలె.. ఆ రావణుడ్ని చూసి పొంగిపోవాలె.. సంద్రం దాటి రావాలె… ఇది కదా ! ఎన్టీఆర్ అనే పేరు తో పలికే లేదా పలికించాల్సిన సంభాషణ. ఇవాళ ఆ తారక రాముడి బర్త్ డే..అనగా.. పుట్టిన్రోజు మరియు అభిమానులకు పండగ రోజు.
అమ్మా నాన్న లేని లోటు ఓ పాట లో చెప్పాలి.. ఇవాళ వెన్నెల కవి పుట్టిన్రోజు కూడా.. అనగా సిరివెన్నెల అనే సినీకవి పుట్టిన్రు ఇవాళే ! అప్పుడు రాశారాయన ఎంతో గొప్పగా.. అంతే గొప్పగా ఔన్నత్యం, ఔచిత్యం చెడకుండా తారక్ ఆ పాత్రకు ఆ పాటకు ప్రాణం పోశారు. నా పాటకు అభినయం అన్నది ప్రధానం అని సినీ కవి అంటారు.. అభినయం కన్నా అనుభూతి ప్రధానం అని చెప్పాలి. ఆ విధంగా తారక్ అనే ఈ చిన్న రాముడు ఎన్నో సాధించారు. ఇంకెన్నో సాధించాలి కూడా !
కొరటాల శివ ఆయన్ను ఉద్దేశించి రాశారు.. కుర్రాడేం సాఫ్ట్ కాదు అని ! అవసరం అయినంత ధైర్యం.. కావాల్సినంత తెగువ మరియు సాహసం ఉన్న కుర్రాడు ఎలా ఉంటాడు.. జనత గ్యారేజ్ లో కుర్రాడిలా ఉంటారు. పడుచు పిల్ల చెంత పరుగులు తీస్తే ఎలా ఉంటాడు బృందావనంలో కృష్ణుడిలా ఉంటాడు. రాముడు అతడే.. కృష్ణుడూ అతడే ! తాత పోలిక అని రాయడం సబబు.
స్టూడెంట్ నంబర్ ఒన్ .. ఆది.. సింహాద్రి ..ఆయన జీవితాన్ని ఈ ట్రయో లేదా తెలుగులో త్రికం ఎంతో ప్రభావితం చేశాయి. ఆ విధంగా ఆయన కెరియర్ ను శిఖర స్థాయికి చేర్చాయి. కానీ అవే కొన్ని సార్లు ఆయన విజయాలకు వేగానికీ నిరోధకంగా అవరోధంగా లేదా ప్రతిబంధక పదార్థాలుగా మారేయి. ఆ మాటే ఆయన ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కొమురం భీముడు మాత్రం భలే నచ్చాడు. జీవం పోశాడు. తారక రాముడికి తిరుగే లేదు అని ఇండస్ట్రీ మెచ్చుకుంది. మెగాస్టార్ క్రూ ఒప్పుకుంది.
దటీజ్ తారక్.