“NRITDPకువైట్” BC విభాగం ఆధ్వర్యంలో మరియు NTR TRUST వారి సౌజన్యంతో, కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్” లో నందమూరి తారక రామారావు గారి (NTR) జన్మదినం సంధర్భంగా రక్తదాన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తండోప తండలుగా తెలుగువారు వచ్చి “ 108 “ మంది రక్తదానం చేయడం జరిగినది…
రక్తదాన కార్యక్రమము విజయవంతం కావడానికి, ముఖ్యంగా సూచనలు సలహాలతో ముందుండి నడిపించిన, సీనియర్ నాయకులు బలరామ్ నాయుడు గారికి, ప్రోగ్రాం సమన్వయ కర్త కొల్లపనేని రమేష్ గారికి, కార్యకర్తలకు , అభిమానులకు , సానుభూతి పరులకు , తెలుగువారికి, ప్రతి ఒక్కరికీ పెరుపేరున, ముఖ్యంగా “డాక్టర్ అస్నా” గారికి, బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి , NTR TRUST వారికీ, “ నమస్తే ఆంధ్ర” యాజమాన్యానికి మరియు కువైట్ ఆంధ్రా యజమాన్యానికి, శ్రీనాధ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ చానల్ వారికి పేరు పేరున దన్యవాదములతో, NRITDP కువైట్ కార్యవర్గం, తరూపన ప్రత్యేక దన్యవాదములు తెలియచేసిన NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి,
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, సందర్భంగా. పలువురు ప్రముఖుల ప్రసంగాలు : –
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న. నందమూరి తారకరామారావు, ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. ఈ పేరుతోనే ఓ చరిత్ర రాయొచ్చు. రామారావు గారు, సినిమాలలో కథా నాయకుడిగా., సామాజిక సేవలో మహా నాయకుడిగా, రాజకీయాల్లో రాజకీయకుడిగా , నూతన నిర్వచనం ఇచ్చి, కోట్లాది జీవితాలలో వెలుగు నింపి, జనసామాన్యంలో విస్తృతంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించి పాతుకుపోయిన వ్యవస్థల మీద యుద్ధం చేసి, రాజకీయాల్లో నాయకీయత చొప్పించిన మహనీయుడు NTR. NRITDP కువైట్ సీనియర్ నాయకులు, “ బలరామ్ నాయుడు దరూరి ” గారు, మరియు “ వెనిగలా బాలకృష్ణ” గారు తన ప్రసంగాలలో తెలియచేసారు .
రామారావు గారు, కాషాయ వస్త్రాలను ధరించినా. లౌకిక వాదాన్ని బలంగా నమ్మేవారని అదేవిదంగా. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో వచ్చి జాతీయవాదిగా నిలబడి, అసాధ్యాలను సుసాధ్యాలుగా మలిచిన ఓ మహాయోధుడని, ఓ కారణజన్ముడని, ఓ యుగపురుషుడని, ఆయన మనకు దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా, ప్రజానీకం మీద అంత ప్రభావం చూపిన వ్యక్తి తెలుగునాడులో మరొకరు లేరని. ఇప్పటికీ, ఎప్పటికీ మనమంతా ఆయన గుర్తుల్లోనే ఉన్నామని, వుంటామని… NTR జన్మదిన సందర్బంగా NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, తన ప్రసంగంలో కొనియాడారు.
స్త్రీ చిన్నప్పుడు తండ్రిమీద, సంసారజీవితంలో భర్తమీద, వృద్దాభ్యంలో కొడుకుమీద అధారపడి బ్రతుకుతూ కొనసాగుతున్న, స్త్రీ పురుషుల అసమాన సహజీవన విధానాన్ని, సమాన సహజీవనంగా రూపోందించి, వారసత్వ సంపదలో సమాన హక్కులు కల్పిస్తూ శాసనం జారీ చేయించిన మహానుభావుడు, ఉద్యోగాలలో 30శాతం పోస్టులను మహిళలకు కేటాయించారు. స్త్రీలకు వృత్తి పనులు నేర్పే శిక్షణా సంస్థలు, బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు, స్త్రీలకోసం ప్రత్యేకంగా శ్రీ పద్మావతి మహిళ విశ్వ విద్యాలయాన్ని స్థాపించారు.
గ్రామ పంచాయితీ లలో,మండల ప్రజా పరిషత్తులలో,నియోజక వర్గాలలో మహిళలకు కొన్ని పదవులను ప్రత్యేకించారు. అంతేకాక విద్య,సారస్వత రంగాలలో క్రుషి చేసిన మహిళలను సత్కరించి ప్రోత్సహించారు. ఆయన సేవా నిరతిని గుర్తించి ఆయన చిత్తశుద్దిని గ్రహించి, తెలుగింటి ఆడపడుచులు ఆయనను “అన్నా”అని అప్యాయంగా పిలుస్తున్నారు అని , రాణి చౌదరి గారు (NRITDP కువైట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు), తన ప్రసంగంలో తెలియచేసారు.
తెలుగు జాతికీ, భాషకూ విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన సాధించిన విజయాల గురించి, అద్భుతాల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఆయన నటజీవితంలో అనితరసాధ్యమైన ఎన్నో మైలురాళ్ళున్నాయి. రాజకీయ తెరపైనా ఎన్టీఆర్ ముద్ర సుస్పష్టం. అని రాచూరి మోహన్, (NRITDP కువైట్, జాయింట్ సెక్రెటరీ), తన ప్రసంగంలో తెలియచేసారు.
ఎన్టీఆర్ భౌతికంగా మనకు దూరమైనా, ఆయన నటించిన పాత్రలు, చేసిన సేవలు, అమలు పరిచిన సంక్షేమ పథకాలు, కట్టిన ప్రాజెక్టులు, వేసిన రోడ్లు, తెలుగు వారి గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికీ ,చిరస్థాయిగా నిలచిపోతాయి. ఇప్పటికి ఎందరో అభిమానులు ఆయనను ఒక దేవుడిగా స్మరిస్తూ, కొలుస్తూ, తరాలైనా మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ‘తెలుగు జాతి’కి గర్వకారణం తెలుగు పలుకులను, తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన ఆ అవిశ్రాంత యోధుడు 25 ఏళ్ల క్రితం అందరికీ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు మాత్రం నేటికీ అందరిలోనూ అదే స్ఫూర్తిని నింపుతున్నాయి.అని మల్లి కార్జున్ నాయుడు, (NRITDP కువైట్ తెలుగుయువత అధ్యక్షులు), తన ప్రసంగంలో తెలియచేసారు.
పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి, బడుగు బలహీన, అణగారిన వర్గాలకు సంక్షేమ ఫలాలు ,పాలనలో భాగస్వామ్యం కల్పించి తెలుగుదేశం అంటే నీది, నాది, మన అందరిది, చెప్పిన వ్యక్తి, శక్తి , వ్యవస్థ NTR రామారావు గారు, ఆయన గురించి మాట్లాడడమంటే, సూర్యుడిని వేలుతో చూపించి నట్లవుతుందని, భూమిపై అందరూ పుడతారని, అయితే అందరూ మహానుభావులు కాలేరని, మనిషి అయిన విజయపథంలో నడవాలంటే, అకుంఠితదీక్ష ఉండాలని చెప్పి, మాటల్లో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించి, ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్న మేరు నగధీరుడుగా చరిత్రలో నిలిచిపోయిన న వ్యక్తి ఎన్టీఆర్ అని వలసాని శంకర్ యాదవ్ (NRITDP కువైట్ బీసీ అధ్యక్షులు), తన ప్రసంగంలో తెలియచేసారు.
నిమ్మకూరు నుండి నింగివరకూ ఎగిరిన, ఎగసిన విజయస్వరూపుడైన, తేజోమూర్తి ఎన్టీఆర్. ఆయన జీవితం వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ, విషాదాంత మైంది. మహానాయకుడు. రాజకీయాల్లోకి వచ్చినా, కుళ్ళురాజకీయాలకు అతీతుడైన మహానాయకుడు, తన ఐశ్వర్యం, కీర్తి, వైభవం ఆన్నీ ఆయన రెక్కల కష్టం, ధర్మార్జితం. నటరత్నగా కోట్లాదిమంది ప్రజల హృదయాలు గెలుచుకున్న ఈ నవరస నటనాభిరామునికి ‘భారతరత్న’ ప్రదానం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నని వెలిగండ్ల శ్రీనివాసరాజు, (NRITDP కువైట్ వుపాధ్యక్షులు) తన ప్రసంగంలో తెలియచేసారు.
తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత నందమూరి తారక రామారావు అభిమానులను అలరించడానికి 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. 50వ దశకంలో 76 సినిమాల్లో నటించగా, 60వ దశకంలో 119 సినిమాల్లో నటించాడు. ఇక 70వ దశకంలో 77 సినిమాల్లో నటించగా, 80వ దశకంలో 25 సినిమాల్లో నటించాడు. ఇక 90వ దశకంలో 4 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారాని, మురళి నాయుడు (NRITDP కువైట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి), తన ప్రసంగంలో తెలియచేసారు.
ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. “మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను” అన్నారని ఆయన రమేష్ కొల్లపనేని (NRITDP కువైట్ తెలుగుయువత సీనియర్ నాయకులు), తన ప్రసంగంలో తెలియచేసారు.
ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారాని బొమ్ము నరసింహులు (NRITDP కువైట్ బీసీ గౌరవ అధ్యక్షులు) తన ప్రసంగంలో తెలియచేసారు.
• రామారావుగారు, అవినీతిరహిత పాలన ఆయన ముద్ర. ప్రజాధనం వృధాకాకుండా చూడడం ఆయన ప్రత్యేకం.పటేల్ పట్వారి వ్యవస్థ నిర్మూలనం, మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగుగంగ నిర్మాణం, కిలో రెండురూపాయల బియ్యం పధకం, విద్యుత్ చార్జీల తగ్గింపు, కార్పొరేషన్ పదవుల సంఖ్య కుదింపు… ఇవ్వన్నీ ఎన్.టి. ఆర్ చేసిన సంస్కరణల, ప్రజాప్రయోజనాల పర్వం అని, పెంచలయ్య పెరుమాళ్ల (NRITDP కువైట్ బీసీ ప్రధాన కార్యదర్శి) . తన ప్రసంగంలో తెలియచేసారు.
ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తూ చైతన్యరథంపై ఆంధ్ర ప్రదేశ్ నలుమూలలకూ ప్రచార యాత్రను సాగించి, చైతన్యరథమే ప్రచార వేదికగా, నివాసంగా చేసుకొని, ఒక శ్రామికుడివలె ఖాకీ దుస్తులు ధరించి, నిరంతరం ప్రయాణిస్తూ, ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకొన్న మహా నాయకుడు అని శివకుమార్ గౌడ్ (NRITDP కువైట్ బీసీ కార్యదర్శి ) . తన ప్రసంగంలో కొనియాడారు.
ఆంధ్రుల ఆత్మగౌరవ పరిరక్షణ మరియు మహిళల విషంలో ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసి, ప్రచార ప్రభంజనముతో కాంగ్రెసు అధికారాన్ని కూకటివేళ్ళతో పెకలించివేసిన దిరుడు అన్న రామారావు గారు అని, విందు (NRITDP కువైట్ మహిళా విభాగం కార్యదర్శి) . తన ప్రసంగంలో తెలియచేసారు.
ఎన్టీఆర్ ప్రసంగాలు ఉద్వేగభరితంగా, ఉద్రేకపూరితంగా ఉండి, ప్రజలను ఎంతో ఆకట్టుకునేవి. అదేవిదంగా మనము కూడా పార్టీని 2024 అదికారంలోనికి తీసుకొని రావడానికి రాష్ట్రంలో జరుగుచున్న అన్యాయాన్ని ప్రశ్నిచడం ప్రతిఒక్కరు ముందుకు రావలసిన అవసరం వుందని పిలుపునిచ్చారు , శివప్రసాద్ పేరూరు(NRITDPకువైట్ బీసీ అధికార ప్రతినిధి).తన ప్రసంగంలో తెలియచేసారు
ఒక 40 ఏళ్ల కిందట కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితిలో అన్న నందమూరి రామారావుగారు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం తీసుకొచ్చి, అదేవిదంగా పిల్లలకు పాఠశాలల్లో ఉచితంగా తిండి పెట్టి ఆదుకొన్న ఆపద్బాందవుడు అన్న నందమూరి , ఒకప్పుడు సంక్షేమం అంటే తినడానికి తిండి లేని వాడికి తక్కువ ధరకే రేషన్ తో తిండి పెట్టడం, పేదలకు మంచి వైద్యం అందించడం, పేద విద్యార్థులకు మంచి విద్య అందించడం. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే, అర్థంకాని పరిస్తితి కాబట్టి ప్రజలు స్వార్థంతో కూడిన సంక్షేమాలు గురించి ఆలోచించ కుండా, స్పూర్తితో సమాజం మీద నమ్మకంతో ఆలోచిస్తేనే దీర్ఘకాలికంగా అందరికీ మంచి జరుగుతుందని . మల్లిశెట్టి రవి (NRITDP కువైట్ తెలుగుయువత అధికార ప్రతినిధి). తన ప్రసంగంలో తెలియచేసారు.
కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చి తన హామీలను అమలుపరిచాడు. సంక్షేమం అనే పదం మొదలు పెట్టినది తెలుగుదేశం పార్టీ మల్లిశెట్టి రవి (NRITDP కువైట్ తెలుగుయువత అధికార ప్రతినిధి). తన ప్రసంగంలో తెలియచేసారు.
సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రదేశ్ లో, అతను సమకాలికుల్లో అతనుంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు. వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే అని ప్రముక సీనియర్ నాయకులు నరసింహా నాయుడు తన ప్రసంగంలో తెలియచేసారు
పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి అని ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారని అబాటలో మనమందరం నడవాలని ప్రముఖ సీనియర్ నాయకులు తుమ్మల రత్నం నాయుడు తన ప్రసంగంలో తెలియచేసారు
తెలంగాణాలో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారని ప్రముఖ సీనియర్ నాయకులు పాలేటి ప్రసాద్ నాయుడు తన ప్రసంగంలో తెలియచేసారు
అదేవిదంగాఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ముఖ్య నాయకులు:-
యనిగల బాలకృష్ణ గారు , ఈరాతి శంకరయ్య, శివకుమార్ గౌడ్, ఆవుల చిన్నయ్య యాదవ్, గుండయ్య నాయుడు , పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ
Thanks for the auspicious writeup. It in reality was
a leisure account it. Glance complex to far brought
agreeable from you! However, how could we keep up a correspondence?