12/11/2021 శుక్రవారం కువైట్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను , సానుభూతి పరులను,కార్యకర్తలను, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే మేధావులను, తటస్థులను, బడుగు బలహీన, దళిత మైనారిటీ వర్గాల నాయకులను, అందర్నీ ఒక వేదికగా చేసి, తీసుకొని వచ్చిన ఘనత మన రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి టి.డి.జనార్ధన్ గారిది.
ఆయన ఆధ్వర్యంలో రూపుదిద్దుకొన్న ఈ NRITDP కువైట్ , పటిష్టమైన కార్యవర్గంతో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటలకు, అధిష్టానం అనుమతితో, వారి ఆదేశాల మేరకు NRITDP కువైట్ తన వంతు బాద్యతగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోరాటాలకు మద్దతునిస్తున్న ప్రతి ఒక్కరికీ NRITDP కువైట్ ధన్యవాదములు తెలియచేస్తు, మీ సహాయ సహకారాలతో దిగ్విజయంగా ముందుకు పోవుచున్నాము.
అదే విధంగా వెనుకబడిన తరగతులను సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందువరసలో నిలిపిన పార్టీ మరియు ప్రభుత్వం తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతిగా చెప్పుకునేందుకు గర్విస్తున్నాము . అందుకే ఈరోజు బీసీ అధ్యక్షులుగా వలసాని శంకర్ యాదవ్ ను యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ నియమించడం జరిగింది . ఈరోజు వివిద పార్టీలనుండి బీసీలు …తెలుగుదేశం పార్టీకి మద్దతుగా , వందల సంఖ్యలో NRITDP కువైట్ లో చేరారు అని NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్రబాబు అక్కిలి తన ప్రసంగంలో తెలియచేశారు.
ప్రముఖుల ప్రసంగాలు : —
• అదేవిధంగా పార్టీకి నిస్వార్ధ సేవ చేస్తున్న మన తోటి సోషల్ మీడియా సభ్యులకు…, అదేవిదంగా ప్రత్యర్థి పార్టీలు మన తెలుగు తమ్ముళ్ల ఆర్ధిక మూలాలను దెబ్బతీస్తున్నా, బెదరకుండా…! పార్టీ కోసం నిలబడి, తెలుగుదేశం పార్టీని, తమ తల్లిగా భావించే మన సోదరులకు…నమస్కారములు అని.. యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ , జాయింట్ సెక్రెటరీ రాచూరి మోహన్ తెలియచేశారు.
• ప్రత్యర్థి పార్టీ పనికట్టుకొని, పసలేని, ప్రజలకు పనికిరాని, ప్రయోజనం లేకుండా చేస్తున్న, తప్పుడు ప్రచారం ఏమిటో తెలుసా…..! కుల ముద్ర…. ఎవరికైనా దమ్ము వుంటే, తెలుగుదేశం పార్టీ మా కులానికి సంబందించిన పార్టీ, అని చెప్పమనండి… OPEN CHALLENGE…!!! చెప్పలేరు …!!! ఎందుకంటే, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందిన పార్టీ కాదు…..మా మతం తెలుగుదేశం , మా కులం తెలుగుదేశం అని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ తెలుగుయువత అధ్యక్షులు, మల్లి కార్జున్ నాయుడు ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ విత్తనం లాంటిది, పాతిపెట్టె కొద్ది మొక్క అయి లేవడమే … తెలుగుదేశం నైజ , దీనిని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గుర్తుంచు కోవాలి…. పార్టీ బలోపేతానికి మా వంతు బాద్యతగా బీసీలమందరం ఏకమై సమిష్టిగా కృషి చేసి పార్టీని అదికారంలోనికి తీసుకొని వస్తాం …. ఎవరైతే క్రమశిక్షణతో, దీక్షతో కార్యకర్త అనే మొదటి మెట్టు ఎక్కి, అందులో రాటుదేలిన వాడే రాజకీయాలలో మిగతా మెట్లు అధిరోహించ అవకాశం వుంటుంది.
అలాంటి వాడే దీర్ఘకాలం ప్రజలలో నిలవగలడు… ఆ కార్యకర్త పాత్ర, విలువ, తెలిసిన వాడే నాయకుడు…… ప్రజానాయకుడు. అందుకే ఈ రోజు యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ నన్ను బీసీ అధ్యక్షుడిగా నాపైన పెట్టిన బాద్యత సక్రమముగా నిర్వహిస్తానని, మాట ఇస్తున్నాను అని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ బీసీ అధ్యక్షులు వలసాని శంకర్ యాదవ తన ప్రసంగంలో తెలియచేశారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను, ప్రజలకు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తూ, ప్రత్యర్థిపార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు తిప్పికొడుతూ, ఎంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, సంయమనం కోల్పోకుండా, ఎంతో సహనంతో, క్రమశిక్షణతో, తెలుగుదేశం పార్టీ నియమాలను ఆచరిస్తూ, అనుకరిస్తూ, నిరంతరం పార్టీకి అండగా ఉంటూ, తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపిస్తున్న, మన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు… ప్రత్యేక వందనాలు అని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ సోషల్ మీడియా ఇంచార్జ్ రాణి చౌదరి గారు ప్రసంగించారు.
• ముఖ్యంగా 2024 ఎన్నికల్లో. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావాలని. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తెలుగుసమాజాలకు తెలుగుదేశం పసుపు సైనికులకు యెల్లో సెల్యూట్ చేస్తున్నా అని వుద్వేగంతో మాట్లాడుచు మీకందరికి తెలుగుదేశం సాక్షిగా పాదభివందనం…. చేస్తున్నా …. అని వెలిగండ్ల శ్రీనివాసరాజు , యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ తెలుగుయువత వుపాధ్యక్షులు ప్రసంగించారు.
• కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడి, ప్రజల కష్టాలు, అవసరాలు తెల్సుకొని, వారకి నిత్యం అందుబాటులో వుండి, పార్టీ పైన ప్రజలకి నమ్మకం కల్గించి, దాన్ని ఓటు రూపంలో మార్చి , ‘తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చి , పార్టీ ప్రజా ప్రతినిధులుగా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసమే, శ్రమిస్తూ, ముందూకు పోవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తపై వుంది అని యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మురళి నాయుడు తన ప్రసంగంలో తెలియచేసారు.
• మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ ని కులానికి అంట కడుచున్నారు అంటే … ఇక్కడ ఒక చిన్న సామెత వుంది … ఒక కుక్కను చంపాలి .. చంపితే ప్రజలు తిడతారు , అందుకని ముందుగా కుక్కకు పిచ్చి పట్టింది, అది కరిస్తే మనకు పిచ్చి పడుతుంది, అని ప్రచారం చేస్తారు….ఆ బ్యాచ్ నుండి కొంతమంది వచ్చి పిచ్చి పట్టినట్ట్లు ప్రచారం చేస్తారు, మరి కొంతమంది అదే బ్యాచ్ లో ముందుకు వచ్చి చంపేస్తాం పదండి అంటారు … ఆ తరువాత అందరూ అనుమతితో… ఆ కుక్కను కలసి చంపుతారు…. ఆ కుట్రలో బాగమే, మన తెలుగుదేశం పార్టీ పైన మరియు అమరావతి పైన చేస్తున్న ఆరోపణలు అన్నీ … దీనిని మనం ప్రజలు గమనించాలి …. అని , యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ తెలుగుయువత సీనియర్ నాయకులు రమేష్ కొల్లపనేని తన ప్రసంగంలో తెలియచేయారు.
• గుండెను జెండాగా చేసి, తమ గుండెలే కవచాలుగా రాజకీయ గుండాల దౌర్జ్యన్యాలను ఎదురొడ్డి, తెలుగుదేశం జెండాను రెపరెపలాడిస్తున్న ఘనత కార్యకర్తలదే … ! ప్రతీ కార్యకర్త తాను కూడా ఒక అభ్యర్ధిగానే భావించి పార్టీ విజయానికి , అభ్యర్ధుల విజయానికి అలుపెరగని సైనికులు లాగా పని చేస్తే ప్రతి సారి జరిగే ఎన్నికలలో TDPని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. అయితే వారిలో చైతన్యం నింపి పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసే విధంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని , ఈ సమావేశంలో ఇతర ముఖ్య నాయకులు యనిగల బాలకృష్ణ గారు , కె నరసింహా నాయుడు , గుండయ్య నాయుడు , రత్నం నాయుడు తుమ్మల , శ్రీనివాసులు నాయుడు పొలారపు , పేరూరు రామకృష్ణ, జనార్ధన , పెంచలయ్య పెరుమాళ్ల , హేమంత్ రాయల్ , శ్రీను , వేణు , ఈశ్వరయ్య , శివకుమార్ గౌడ్ విడివిడిగా తన ప్రసంగంలో తెలియచేశారు.