ఆంధ్రప్రదేశ్‌లో జరుగుచున్న దళితుల పై దాడులు ఒక్క దళితుల సమస్య మాత్రమే కాదు. మానవహక్కుల సమస్య. మానవతావాద సమస్య. అంటరాని తనం, కులవివక్షని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ ఈ ఆగడాలను ఖండించాలి. పెత్తందార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే గ్రామాల్లో దళితులు బలహీనవర్గాలే కాదు పేద, మధ్యతరగతి రైతులు, వృత్తిదార్లు కూడా నిలబడలేరు. కాంట్రాక్టర్లు వీరే, మిల్లర్లు వీరే, వడ్డీ వ్యాపారస్తులు వీరే, ఎరువుల షాపులు వీరివే, మార్కెట్ దందా వీరిదే. ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన సబ్‌ప్లాన్ నిధుల్ని వీరే కైంకర్యం చేసుకుంటారు. పేరు దళితులది నిధులు పెత్తందారులకు.ప్రతి ఒక్క దళిత సంఘం కలసి కట్టుగా కదలి దండుగా తెలుగుదేశం పార్టీ తో కలసి పొరాడి దళిత హక్కులను కాపాడు కొందామని యం.ఆర్.పి.యస్ కువైట్ వ్య్వవస్థాపక అద్యక్షులు మందా నరసింహులు , వెలకచర్ల రాజయ్య తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
గత కొద్ది నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతల్లో దళితులపై దాడులు జరుపుతూ, ఒకవైపు దళిత తేజం అంటూ శుష్క వాగ్దానాలు చేస్తూ దళితుల్ని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నది, మరోవైపు దళితులపై దాడికి తెగబడుతున్న అస్మదీయులను అక్కున జేర్చుకుంటుంది, దాడులకు గురైన దళితులను ఆదుకోవడానికి బదులుగా బెదిరించి రాజీల పేరుతో అణచాలని చూస్తుంది. ఈ చాణిక్య నీతికి దళితులు బలిపశువులుగా మారిపోతున్నారు. ఈరోజు దేశంలోనే దళితులపై జరిగే దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది, తరతరాలుగా సాగుజేసుకుంటున్న దళిత భూముల్ని అభివృద్ధి పేరుతో అడ్డంగా ఆక్రమించేస్తున్నారు అని . యం ఆర్ పి యస్ కువైట్ అద్యక్షులు వెలక చర్ల వెంకటేష్ తన ప్రసంగంలో తెలియచేసారు
దళితులు పంచాయతీ సర్పంచులుగా ఉన్నా, ఎమ్మెల్యేలైనా ఆచరణలో పెత్తనం వీరిదే. అయినా దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఇది అన్యాయమని నోరెత్తి ఒక్కమాట అనలేకపోతున్నారు. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీరు కూడా అగ్రకుల పెత్తందార్లకే అండగా ఉంటున్నారు అని యం ఆర్ పి యస్ కువైట్ కార్యదర్శులు మందా శివయ్య, మంఆద శివశంకర్ , రెడ్డి పాక రామచంద్ర తెలియ చే శారు .
ఈ సందర్బంగా వెంకట్ కోడూరి మాట్లాడుతూ … రాజకీయాలకు అతీతంగా నిజమైన మానవతావాదులు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందిస్తారు. ప్రపంచంలో ఎక్కడో కాదు, మన కళ్ళ ముందు ఎన్ని అప్రజాస్వామిక సంఘటనలు జరిగినా ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజలను చైతన్య పరచాల్సిన మేథావుల స్మశాన నిశ్శబ్దం ఎందుకు ..? ప్రజాస్వామిక విలువలు పతనమవుతున్న వేళ, ధైర్యంగా వెలుగెత్తి నినదించే మేథో గొంతుకలెక్కడ? సంశయాల ఊబిలోకి కూరుకు పోయినట్లు నోళ్ళు తెరచుకోవటం మానేశాయా …? నేల చూపులతోనే కాలం గడిపేస్తారా? రాజీ కార్యక్రమాలతో చరిత్రహీనులవుతారో, ప్రజల పక్షాన నిలబడి చరిత్రలో నిలిచిపోతారో ఆలోచించండి…?
యం.ఆర్.పి.యస్ నాయకులు వెంకటేశ్ మాట్లాడుతూ, ఎన్నారై తెలుగుదేశం కువైట్ అనుబంద సంస్థగా ఎంఆర్పిఎస్ కలసి పని చేస్తామని ఎన్నారై టిడిపి అద్యక్షుడు వెంకట్ కోడూరి , బలరామ్ నాయుడు , నాగేంద్ర బాబు అక్కిలి , షేక్ రహమతుల్లా వెళతామని సంయుక్త సమావేశంలో తెలిపారు. అనంతరం అమరావతి వుద్యమానికి ప్లకార్డుల ద్వారా సంఘీభావం తెలిపారు . ఈ సంధర్భంగా బహుజన పొలికేక JAC అద్యక్షులు బాలకోటయ్య వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ పోరాటానికి మద్దత్తు తెలియచేసినందుకు అభినందిస్తూ, మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు రావాలని కోరారు.