ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాంతం చేసుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి విధాజితాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా ఆదివారం ఆగష్టు 4న ఆస్టిన్, టెక్సాస్ లో AUSTIN NRI TDP ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలో సుమారు 500 మందికి పైగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి NRI అభిమానులు, కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, స్వరాంజలి టీం పాడిన పాటలు అభిమానులని ఎంతగానో అలరించాయి.
రాజకీయ నాయకుల విశేషాలతో కూడిన క్విజ్ ట్రివియా వంటి పలు ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాంగణమంతా తెలుగుదేశం, జనసేన బ్యానెర్లు మరియు జెండాలతో అలంకరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ రుచికరమైన పలు రకాల వంటలతో పెళ్లి భోజనం తరహాలో పసందైన విందు భోజనం ఏర్పాటు చేసారు.
నూజివీడు శాసనసభ్యులు, హౌసింగ్ మరియు సమాచార శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి గారు, తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అద్దంకి శాసనసభ్యులు మరియు విద్యుత్ శాఖామాత్యులు గొట్టిపాటి రవి గారు జూమ్ ద్వారా న్రి అభిమానులకి తమ సందేశాన్ని వినిపించగా, తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ గారు, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, ఉండి శాసనసభ్యులు కారుమూరు రఘు రామ కృష్ణం రాజు గారు, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు,
వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు గారు మరియు పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి గారు ఆన్లైన్లో తమ సందేశాలను వినిపించి, రాష్ట్రాభివృద్ధిలో NRI లు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా వారు NRI లు ఈ విజయం కోసం పడిన కష్టాలను, చేసిన సహాయాన్ని మరువలేమన్నారు.
తన ప్రసంగంలో AUSTIN NRI TDP అధ్యక్షులు లెనిన్ ఎర్రం మాట్లాడుతూ ఈ విజయంలో NRI లు కీలక పాత్ర పోషిచారని, దొంగ ఓట్లు గుర్తించి తీసివేయడానికి, NRI లను నియోజకకవర్గ నాయకులతో సమన్వ పర్చడానికి, పోల్ మానేజ్మెంట్ కొరకు యాప్ లను తయారు చేసి సాంకేతికంగా కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందించారన్నారు. మరో పదేళ్ల పటు సుస్థిర ప్రభుత్వం ఉంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని అందుకు NRI ల సహకారం తప్పనిసరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి ఈ విజయనానికి కృషి చేసిన కార్యకర్తల్ని గుర్తించి వారికి పార్టీ అవకాశాలు కల్పించాలని కోరారు.
జనసేన నాయకులు ప్రసాద్ చిగిలిశెట్టి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారం లోకి రాకూడదని, అలా రాకుండా చెయ్యాలంటే రాష్ట్రాభివుద్ది జరగాలంటే తప్పకుండా కూటమి లోని పార్టీలన్నీ కలిసి పనిచేయాలని అన్నారు.
తెలుగుదేశం రీజినల్ రెప్రెసెంటేటివ్ సుమంత్ పుసులూరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిని, అరాచకాల్ని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కేవలం తెలుగుదేశం వల్లే సాధ్యమని, చంద్రబాబు గారి లాంటి సమర్దుడిని ఎన్నుకుని ప్రజలు రాష్ట్రాన్ని మరో బీహార్ కాకుండా కాపాడుకున్నారని కొనియాడారు. కార్యకర్తలు ప్రాణం పెట్టి పని చేసారని NRI లు ఎప్పుడు లేన్నంతగా ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు.
ఈ కార్యక్రమాన్ని AUSTIN NRI TDP సభ్యులు లెనిన్ ఎర్రం, హరి బాచిన, ఉదయ్ మేక, ప్రసాద్ కాకుమాను, శ్రీధర్ పోలవరపు, సుమంత్ పుసులూరి, బాలాజీ పర్వతనేని, చిరంజీవి ముప్పనేని, శివ తాళ్లూరి, చరణ్ బెజవాడ, యశ్వంత్ పెద్దినేని, విజయ్ దొడ్ల, రామకృష్ణ నేలపాటి, కార్తీక్ గోగినేని, రవి కొత్త, సదా చిగురుపాటి, సాంబ వెలమ, కృష్ణ ధూళిపాళ్ల, సతీష్ గన్నమనేని, బాలాజీ గుడి, మాధవ్ జాలాది, రఘు దొప్పలపూడి, సురేంద్ర అప్పలనేని, శ్రీని బైరపనేని, నరేష్ కాట్రగడ్డ, రంగ గాడిపర్తి తదితరులు విజయవంతంగా నిర్వహించారు.
చివరిగా మహిళలు, పిల్లలు, పెద్దవారు చేత కేక్ కట్ చేయించి, సాంసృతిక నృత్యాలు ప్రదర్శించిన వారందరికీ ట్రోఫీలు అందజేసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.