ఆస్టిన్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ మహానాడు ఆస్టిన్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన జరిగింది.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు.
అన్నగారిని స్మరించుకుంటూ , అయన తలపెట్టిన వినుతున్న నిర్ణయాలు అలాగే అయన ఆశయ సాధనాలు, రాబోయే తరానికి వివరిస్తూ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా దివాళా తీయించిందో వివరించి, తెలుగుదేశం ప్రభుత్వం రావలసిన ఆవశ్యకతని వివరించారు.
ఈ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.