రాజకీయ పార్టీలు ఇప్పుడు ఎన్నికలు అర్ధాన్నే మార్చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఎంత డబ్బు ప్రవాహం పొంగిస్తే అన్ని ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి ఓడిచేయచ్చనే ధీమాతో ఉన్నారు. అలా డబ్బును నీళ్ల ఖర్చు చేస్తున్నారు.
గెలుపు కోసం ఎన్నికోట్లు వెచ్చిస్తే గెలుస్తామో అనే అంచనాకు వచ్చేశారు. ప్రస్తుతం ఎంపీగా గెలవాలంటే సుమారుగా రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని, ఎమ్మెల్యేగా విజయం సాధించాలంటే 20 నుం 30 కోట్లు ఉంటే గెలవడం ఖాయమని రాజకీయనాయకులు చెబుతున్నా మాట.
వీటితో పాటు కుల సమీకరణ, వర్గ సమీకరణలు ఇవ్వన్నీ అనుకూలంగా ఉంటేనే విజయం ఖాయమని విశ్లేషణలు చేస్తుంటారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఏ ఎన్నికల్లోనైనా గెలివడం ఒక్కటే ప్రామాణికం కాదు. గెలిచిన తర్వాత క్యాంపు రాజకీయాలు.. గెలుపు గుర్రాల గొంతెమ్మ కోర్కెలు ఇలా అనేక మజిలీలు రాజకీయ పార్టీల్లో నిత్యం మన అనుభవంలో చూస్తుంటాం.
ఇదే తరహాలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరుగుతుండడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా ‘మా’ ఎన్నికలను తీసుకున్నారు? ఓటర్లకు రాజకీయా నాయకులు గుప్పించనట్లూ ‘మా’ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు ఎందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు?
గెలిచన తర్వాత ఆ హామీలు నెరవేర్చుతారా? లేక రాజకీయ పార్టీ నాయకులు అన్నట్టు ‘ఓటుకు నోటు తీసుకుని మమ్మల్ని గెలిపించారు? ఎందుకు మీకు సంక్షేమం కోసం మేం కృషి చేయాలి’ అని రాజకీయ నేతలు చెప్పినట్లే మా అధ్యక్ష పదవిలో గెలిచిన వారు ముఖం చాటేస్తారా? ఇలా అనేక సందేహాలకు అనుమానాలకు (మా) ఎన్నికలు కేంద్రంగా నిలుస్తున్నాయి.
మా సాదారణ ఎన్నికల తరహాలోనే ‘మా’ఆర్టిస్ట్ ఎన్నికలు తలపిస్తున్నాయి. గెలుపు కోసం ఎంత ఖర్చుకైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విందులు, క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మా ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రశాష్రాజ్, హీరో మంచు విష్ణుతో పాటు నటుడు సీవీఎల్ నర్సింహారావు మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా ప్రకాష్‌రాజు ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్యనే పోటీ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఓట్లను కొనుగోలు చేసుందుకు భారీ ఖర్చు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అటు ప్రకాష్‌రాజ్ ప్యానల్ ఇటు మంచు ప్యానల్ ఎక్కడ తగ్గకుండా జెట్ స్పీడులో దూసుకుపోతోంది. అందివచ్చిన ఓ అవకాశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్‌రాజ్ తన నటనతో పాటు ఆయన సామాజిక అంశాలపై ఎప్పిటికప్పుడు స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇక మంచు ఫ్యామిలీకి కూడా అటు సినీ, రాజకీయ రంగాల్లో బలమైన పరపతి ఉంది. ఇద్దరి బాలబాలలు సమతూకంలో ఉన్నందున ఈసారి మా ఎన్నికలు అంతా సాధారణంగా ఏమి జరుగవు అని సినీ విశ్లేషకులు చెపుతున్న మాట. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టిస్టుకు జల్లెడ పట్టి మరీ వెతుకున్నారంట.
వారిని వ్యక్తిగతం కలిసి పలు హామీలు గుప్పిస్తున్నారని సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇస్తూ.. ఎన్నికల రోజు అందుబాటులో ఉండేలా ఆర్టిస్టుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహిస్తారు. అదే రోజు ఫలితాను వెల్లడిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. నిన్న (సోమవారం) ప్రకాష్‌రాజ్ నామినేషన్ వేశారు. సీవీఎల్ నర్సింహారావు కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ నిన్న నామినేషన్ వేశారు. హేమాహేమీలు పోటీలో తలపడుతుండంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు హాట్ హాట్‌గా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.