తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు దేశ వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగటం.. వాటి ఫలితాలు ఆదివారం వెలువడటం తెలిసిందే. మునుగోడులో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ విజయం సాధించగా.. మిగిలిన ఆరు స్థానాల విషయానికి వస్తే.. ఒడిశా.. మహారాష్ట్ర.. బీహార్.. హరియాణా.. యూపీ రాష్ట్రాల్లో జరిగాయి. ఈ ఉప పోరులో ఒక చోట నోటాకు (బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు కాదు) రెండో స్థానం దక్కటం రాజకీయంగా సంచలనమైంది. ఇందుకు మహారాష్ట్ర వేదికైంది.
అంధేరీ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీనికి శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అభ్యర్థి.. రమేశ్ సతీమణి రుతుజను తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే.. ఆమెకు పోటీగా బీజేపీ.. ఏక్ నాథ్ శిండే వర్గం తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో పోటీ ఏకపక్షంగా మారింది. దీనికి తోడు శివసేనకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ.. కాంగ్రెస్ లు కూడా రుతుజాకు మద్దతు ఇవ్వటంతో పోటీలో ఆమె.. ఇండిపెండెంట్లు మాత్రమే మిగిలారు. ఈ నేపథ్యంలో ఆమె విజయం సాధించగా.. రెండో స్థానంలో నోటా నిలిచింది.
మొత్తం 86,750 ఓట్లు పోల్ కాగా.. లట్కేకు 66,530 ఓట్లు వచ్చాయి. నోటాకు 14.79 శాతం లెక్కన 12,806 ఓట్లు లభించాయి. మిగిలిన ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కలిపి కూడా 1600 ఓట్లు రాకపోవటం గమనార్హం. శివసేన రెండు ముక్కలు అయిన తర్వాత వచ్చిన మొదటి ఉప ఎన్నిక ఇదే కావటం గమనార్హం. హర్యానాలో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుటుంబానికి ముఖ్యమైన ఆదంపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన ఆయన మనమడు భవ్య బిష్ణోయ్ విజయం సాధించారు.
ఇటీవల ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. తనకు బదులుగా తమ కుమారుడ్ని అభ్యర్థిగా బరిలోకి దించారు. తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంటూ విజయం సాధించారు. 1968 నుంచి భజన్ లాల్ కుటుంబం చేతిలోనే ఈ నియోజకవర్గం పగ్గాలు ఉండటం విశేషం. ఒడిశాలోని ధామ్ నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దీనికి కారణం.. ఈ సిట్టింగ్ సీటు బీజేపీదే. వారి ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథి మరణించటంతో ఉప పోరు అనివార్యమైంది. మరణించిన ఎమ్మెల్యే కుమారుడికి బీజేపీ టికెట్ ఇవ్వగా.. ఆయన విజయం సాధించారు. యూపీలోని తమ సిట్టింగ్ సీటును అధికార బీజేపీ నిలబెట్టుకుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే అర్వింద్ గిరి మరణంతో ఆయన కుమారుడ్ని అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగాపై 34 వేల ఓట్లు తేడాతో ఘన విజయం సాధించారు.
ఇక.. బీహార్ లో జరిగిన రెండు స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ.. ఆర్జేడీకి చెందిన సిట్టింగ్ స్థానాలు వారికే దక్కాయి. గోపాల్ గంజ్ లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణంతో ఎన్నిక జరగ్గా.. ఆ స్థానానికి అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సతీమణిని రంగంలోకి దించటం.. ఆమె విజయం సాధించారు. మరో ఉప ఎన్నిక మోకామా నియోజకవర్గానికి జ.రిగింది. ఇక్కడ సమాజ్ వాడీ పార్టీ ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడగా.. ఆయనకు బదులుగా ఆ ఎమ్మెల్యే సతీమణికి టికెట్ ఇచ్చి బరిలోకి దించారు. ఆమె విజయం సాధించారు.