ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్ పై అర్జెంటీనా చరిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియెనెల్ మెస్సీ అద్భుత ప్రదర్శనతో తన దేశానికి మూడోసారి ప్రపంచ కప్ ను అందించాడు. నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా పెనాల్టీ షూటౌట్ వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో మెస్సీ తన మ్యాజిక్ తో జట్టును గెలిపించాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతానని చెప్పిన అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ…తాజాగా మనసు మార్చకున్నాడు.
జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి వైదొలగట్లేదని, ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో మరిన్ని మ్యాచ్ లలో ఆడాలని అనుకుంటున్నానని మెస్సీ ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సమకాలీన ఫుట్ బాల్ ఆటగాళ్లలో లెజెండరీ హోదాలో ఉన్న ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. ఇక, ఈ సాకర్ కప్ అర్జెంటీనా గెలవడంతో భారత్ లోనూ ఫుట్ బాల్ పై క్రేజ్ మరింత పెరిగింది. మెస్సీ మేనియా…సాకర్ ఫివర్ మన దేశాన్ని కూడా తాకింది.
మరోవైపు, యావత్ క్రీడా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత అదే రేంజ్ లో జరిగిన ఈవెంట్స్ అభిమానుకు మరింత కిక్ ఇచ్చాయి. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, దీపికా పదుకోనేలతో పాటు నోరా ఫతేహి కూడా ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ వేడుకల్లో సందడి చేశారు. ‘పఠాన్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా షారూక్, దీపిక మ్యాచ్ కు హాజరై సందడి చేశారు. దాంతోపాటు, ఓ టీవీ డిబేట్ లో షారూక్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక, ఫైనల్ కు ముందు మైదానంలో దీపిక పదుకోనే ప్రపంచ కప్ ట్రోఫీని విడుదల చేసింది.
ఇక, ముగింపు వేడుకల్లో బాలీవుడ్ ఐటం బాంబ్ నోరా ఫతేహి డ్యాన్స్ సాకర్ అభిమానులను ఉర్రూతలూగించింది. ముంగిపు వేడుకలకు మంచి కిక్ ఇచ్చేలా నోరా తన అంద చందాలను ఆరబోసింది. ప్రముఖ ర్యాపర్లు బాల్కీస్, రహ్మా రియాద్, మనల్‌లతో పాటు ‘లైట్ ది స్కై’ గీతానికి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. నల్ల రంగు డ్రెస్సులో స్టేజీపైకి వచ్చిన నోరా తన నృత్యంతో పాటు గాత్రంతోనూ అలరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
With Lusail Stadium packed to capacity the FIFA World Cup 2022 Closing Ceremony was indeed a spectacular event! The highlight of the Ceremony was undoubtedly #NoraFatehi’s power-packed performance of the FIFA anthem 'Light The Sky'. pic.twitter.com/lRKWsjX1il
— Faridoon Shahryar (@iFaridoon) December 18, 2022