ఆదివారం ఏరువాక పౌర్ణమి. అయితే.. ఏంటి? అంటారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. ఈ పౌర్ణమి సాధారణంగా వచ్చే పౌర్ణమి వంటిది కాదు. దీనికి రైతులకు పేగు బంధం వంటి అవినాభావ సంబంధం ఉంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి అనగానే.. భారీ ఎత్తున రెండు రోజుల ముందు నుంచే సంబరాలు చేసేది. స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోనే ఫ్యాంటు పైకి ఎగలాగి.. పొలంలోకి దిగి.. నాగలి పట్టి పనులు ప్రారంభించేవారు. అదే సమయంలో రైతులకు అందాల్సిన అన్నింటినీ అందించేవారు.
రైతులు బాగుండాలని, పంటలు బాగా పండాలని కోరుతూ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏం జరిగింది? అంటే.. ఎక్కడా చడీ చప్పుడు లేదు. రైతు రాజ్యమని, రాజన్న రాజ్యమని చెప్పుకొనే జగన్.. తాడేపల్లికే పరిమితం అయ్యారు. అయితే.. ఒక్క మరో విషయం చెప్పుకోవాలి. నాడు చంద్రబాబు రైతులు, పంటలు, ప్రజలు బాగుండాలని ఏరువాక పౌర్ణమికి ప్రాధాన్యం ఇస్తే.. ఇదే రోజు జగన్ తాడేపల్లిలో తన శాంతి కోసం.. తన రక్షణ కోసం.. తన పాలన మళ్లీ మళ్లీ రావాలనే ఉద్దేశంతో శాంతి యజ్ఞం చేసుకున్నారు.
ఇక, తాజాగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రమంతటా వేడుకల్ని నిర్వహించారు. రైతులతో కలిసి దుక్కులు దున్ని.. పొలాల్లో సేద్యం పనుల్ని ప్రారంభించా రు. అన్నదాత ఆనందంగా ఉండాలని పూజలు చేశారు. స్థానిక రైతులతో కలిసి గ్రామదేవతకు పొంగళ్లు సమర్పించి పూజలు చేశారు. రైతులతో కలిసి భూమాత, గోమాతకు పూజలు నిర్వహించారు. ఎద్దులతో పొలానికి ర్యాలీగా వెళ్లారు. సో.. చంద్రబాబుకు, జగన్కు తేడా ఇదేనని అంటున్నారు పరిశీలకులు.